ఎన్నో రోజుల నుంచి భారత క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా అలరిస్తూ వస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది ఆటగాళ్లు అద్భుతమైన ఆట తీరుతొ ఆకట్టుకుంటున్నారు. ఇక ఎప్పటిలాగానే యువ ఆటగాళ్లు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇంకోవైపు కొన్ని టీమ్స్ ఇక టైటిల్ ఫేవరెట్ గానే ఈ ఐపీఎల్ లో బరిలోకి దిగినప్పటికీ.. ఎందుకో ఆశించిన స్థాయిలో మాత్రం ప్రదర్శన చేయలేకపోయాయి.


 మరికొన్ని టీమ్స్ మాత్రం అంచనాలకు మించి రానించి అదరగొట్టాయ్. అయితే చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్థానం ఇక ఈ ఐపిఎల్ సీజన్లో అసాంతం ఎంతో ఆసక్తికరంగా సాగింది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ ప్రారంభానికి ముందే కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో.. కొత్త సారధితో చెన్నై జట్టు బరిలోకి దిగింది. ఇక ధోని ఆధ్వర్యంలో కొత్త కెప్టెన్ ఋతురాజ్ జట్టును ఎంతొ సమర్థవంతంగానే ముందుకు నడిపించాడు. కానీ ప్లే ఆఫ్ లో అడుగు పెట్టాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో అటు చెన్నై ఓడిపోవడంతో చివరికి లీగ్ దశతోనే సరి పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అంటూ ప్రచారం జరుగుతుంది.


 దీంతో ఈ ఐపీఎల్లో చెన్నై ఆడిన ప్రతి మ్యాచ్ కి కూడా అటు భారీగా అభిమానులు తరలివచ్చారు. ఇక ధోని బ్యాటింగ్ కి రావాలని ఇతర ఆటగాళ్లు అవుట్ అవ్వాలని కూడా అభిమానులు కోరుకున్నారు అని చెప్పాలి. ఇలాంటి సమయంలో క్వాలిఫైయర్ 2 మ్యాచ్ ముగిసిన తర్వాత చపాక్ స్టేడియం బయట ఒక క్రికెట్ ఫ్యాన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారిపోయాయి. చాలా కాలం తర్వాత ఐపీఎల్లో ప్రశాంతంగా మ్యాచ్ చూసాను. ధోని ఫ్యాన్స్ కారణంగా ఇక్కడ సీఎస్కే మ్యాచ్ అంటే చాలు సర్కస్ లాగా మారిపోయింది. మ్యాచ్ ను ఎంజాయ్ చేయలేకపోతున్నాం. ధోని ఒక దిగ్గజం. నాకు చాలా ఇష్టం. కానీ ఆయన కోసం ఇతర ఆటగాళ్లను ఔట్ కావాలని కోరుకోవడం.. నా దృష్టిలో ప్రొఫెషనల్ క్రికెట్ అనిపించుకోదు అంటూ ఒక క్రికెట్ ఫ్యాన్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: