
ఇక గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నిలో అయితే దాదాపు ప్రపంచ కప్ గెలిచినంత పని చేసింది టీమ్ ఇండియా. ఫైనల్ వరకు ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోకుండా దూసుకుపోయిన టీమ్ ఇండియా.. ఫైనల్ లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంది అని చెప్పాలి. అయితే జూన్ నెలలో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ లో మాత్రం తప్పక విజయం సాధించాలి అనే పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే ఇప్పటికే జట్టు ఎంపిక కూడా పూర్తయింది. ఇక వరల్డ్ కప్ కు ఎంపికైన ఆటగాళ్లు ఐపీఎల్ లో కూడా మ్యాచ్లను ముగించుకోవడంతో.. అందరూ ప్లేయర్లు అమెరికా బయలుదేరారు.
అమెరికాలో టీమిండియా ఆటగాళ్లకు ఘనస్వాగతం లభించింది అని చెప్పాలి. అయితే t20 వరల్డ్ కప్ ఫస్ట్ మ్యాచ్ కోసం టీం ఇండియా అమెరికా బయలుదేరగా.. అటు విరాట్ కోహ్లీ మాత్రం వెళ్లలేదు. పేపర్ వర్క్ పెండింగ్లో ఉండటం వల్ల కోహ్లీ న్యూయార్క్ వెళ్లలేకపోయారని.. ఈనెల 30వ తేదీన వెళ్తారని. క్రీడా వర్గాల నుంచి సమాచారం. అయితే ఇప్పటికే అమెరికా చేరుకున్న ఆటగాళ్లతో కోచ్ రాహుల్ తో పాటు సహాయక సిబ్బంది కూడా ఉన్నారు అన్నది తెలుస్తోంది.