ఈ క్రమంలోనే కోల్కతా జట్టును ఈ సీజన్లో ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పై ప్రశంసలు వర్షం కురుస్తున్నాయ్. జట్టులో ఎంతమంది స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ ఆ జట్టుకు కెప్టెన్ ఎంతో ముఖ్యమని.. అలాంటి సమర్థవంతమైన కెప్టెన్ ఉన్నాడు కాబట్టి కోల్కత జట్టుకు విజయం వరించింది అంటూ అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే టీం ఇండియాలో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న అయ్యర్ గత కొంతకాలం నుంచి ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. ఎందుకంటే గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత వెన్నునొప్పి గాయంతో అతను క్రికెట్ కి దూరం అయిపోయాడు.
మరోవైపు అటు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ అతనికి ఎలాంటి గాయం లేదు అంటూ రిపోర్ట్ ఇచ్చింది. దీంతో శ్రేయస్ గాయం లేకపోయినప్పటికీ కావాలనే డ్రామాలు ఆడుతున్నాడు అంటూ ఇక ఎంతోమంది విమర్శలు కూడా చేశారు. ఇలాంటి సమయంలోనే అటు బీసీసీఐ కూడా అతన్ని సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది కాస్త మరింత సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఇదే విషయం గురించి ఇటీవల స్పందించాడు. వన్డే వరల్డ్ కప్ తర్వాత తాను తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడినట్లు చెప్పుకొచ్చాడు అయ్యర్. కానీ తన బాధ ఎవరూ పట్టించుకోలేదని వాపోయాడు. సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయినప్పుడు బాధనిపించింది అంటూ చెప్పుకొచ్చాడు.