బౌలింగ్లో బ్యాటింగ్లో ఫీల్డింగ్ లో ఇలా అన్ని విభాగాల్లో కూడా ఎంతో పటిష్టంగా కనిపించినా కోల్కతా జట్టు.. మొదటి మ్యాచ్ నుంచే ప్రత్యర్థులను చిత్తు చేస్తూ వరుస విజయాలు సాధిస్తూ దూసుకు వచ్చింది ఈ క్రమంలోనే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతూ హవా నడిపించింది అని చెప్పాలి. ఇలా టైటిల్ పోరులో తమకు పోటీ ఇచ్చిన ప్రతి జట్టును ఓడిస్తూ వెనక్కి నెడుతూ వచ్చిన కోల్కతా జట్టు అటు ఫైనల్ మ్యాచ్లో కూడా అత్యుత్తమ ప్రదర్శన చేసింది. ఈ క్రమంలోనే టైటిల్ విజేతగా నిలిచింది అని చెప్పాలి.
అయితే కోల్కతా నైట్ రైడర్స్ జట్టు టైటిల్ విజేతగా నిలవడానికి ప్రధాన కారణాలు ఇవే అంటూ కొన్ని విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. కోల్కతా జట్టు విజయంలో బౌలర్లు కీలకపాత్ర వహించారు అని చెప్పాలి. ఏకంగా ఆ జట్టులోని ఐదుగురు బౌలర్లు కూడా 17 కు పైగానే వికెట్లు పడగొట్టడం గమనార్హం. వరుణ్ చక్రవర్తి 21, హర్షిత్ రానా 19, రసెల్ 19, సునీల్ నరైన్ 17, స్టార్క్ 17, వైభవ్ అరోర 11 వికెట్లతో రాణించారు. ఇక ఈ సీజన్లో ఇదే బెస్ట్బౌలింగ్ యూనిట్ అని కూడా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే బ్యాటర్లలో సునీల్ నరైన్ 17 వికెట్లు తీయడంతో పాటు 488 పరుగులు చేశాడు ఇక సాల్ట్ 435 పరుగులు, వెంకటేష్ అయ్యర్ 367 పరుగులు, కెప్టెన్ శ్రేయస్ 349 పరుగులతో రాణించారు. వీళ్లు రాణించడం వల్లే కోల్కతా ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచింది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.