అయితే ఇలా భారీ ధర పెట్టిన ఆటగాడు ప్రదర్శన ఎలా ఉంటుంది అని అందరూ ఎదురు చూశారు. అయితే ఐపీఎల్ ప్రారంభంలో ఎక్కడ అంచనాలను అందుకోలేకపోయాడు. చెత్త ప్రదర్శన చేస్తూ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇలాంటి ఆటగాడికా 24.75 కోట్ల రూపాయలు పెట్టింది అంటూ కోల్కతా యాజమాన్యంపై కూడా విమర్శలు వచ్చాయి. అయితే కీలకమైన నాకౌట్ మ్యాచ్ లలో మాత్రం అతను అత్యుత్తమ ప్రదర్శన చేసి జట్టును విజయ తీరాల వైపుకు నడిపించాడు అని చెప్పాలి. ఇలా తరచూ తన ఆట తీరుతో వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉన్నాడు.
అయితే ఇక ఇప్పుడు మరోసారి రిటైర్మెంట్ వార్తలతో హాట్ టాపిక్ గా మారిపోయాడు. ఆస్ట్రేలియా బౌలర్ స్టార్క్ వన్డే క్రికెట్ నుంచి రిటైర్ కాబోతున్నాడా అంటే ఇటీవల చేసిన కామెంట్స్ దీనికి ఊతమిచ్చేలాగే కనిపిస్తున్నాయి. కచ్చితంగా నా కెరియర్ ముగింపుకు చాలా దగ్గరగా ఉన్నాను. కాబట్టి ఓ ఫార్మాట్ నుంచి తప్పుకోక తప్పదు. వచ్చే వన్డే వరల్డ్ కప్ చాలా దూరంలో ఉంది. ఇక ఆ ఫార్మాట్ గురించి ఇక ఆలోచించాలి. అలా అయితేనే నేను ఫ్రాంచైజీ క్రికెట్ కి దగ్గరగా ఉంటాను అంటూ చెప్పుకొచ్చాడు స్టార్క్.