ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్న టి20 వరల్డ్ కప్ రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీలో పాల్గొనబోయే 20 జట్లు కూడా టైటిల్ గెలవడమే లక్ష్యంగా.. ఇప్పటికే అన్ని ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకున్నాయి. అయితే ఇప్పటికే వరల్డ్ కప్ కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైన నేపథ్యం లో.. ఏ సమయం లో ఏ జట్టు తో మ్యాచ్ ఉంటుంది అనే విషయంపై పూర్తిస్థాయి క్లారిటీ ఉంది. దీంతో ఇక ప్రత్యర్థులను   ఎదుర్కొనేందుకు ప్రత్యేకమైన వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయ్ అన్ని జట్లు.


 అయితే ఇలా వరల్డ్ కప్ టోర్ని జరిగినప్పుడల్లా అటు మాజీ ప్లేయర్లు ఇచ్చే రివ్యూలు ఎప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంటాయి అని చెప్పాలి. సెమి ఫైనల్లో అడుగుపెట్టబోయే టీమ్స్ ఏవి.. ఇక ఫైనల్లో తలబడబోయే జట్లు ఏవి అనే విషయంపై ముందుగానే ఎంతోమంది మాజీ ప్లేయర్లు తమ అంచనాలను రివ్యూల రూపంలో సోషల్ మీడియాలో చెప్పేస్తూ ఉంటారు. ఇలాంటి రివ్యూ తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి.


 ఈ క్రమం  లోనే రేపటి నుంచి ప్రారంభం కాబోయే.. టి20 వరల్డ్ కప్ 2024 టోర్నీలో ఫైనల్ ఆడబోయే జట్లు ఏవి అనే విషయం పై ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్ ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్లు ఫైనల్లో తలబడతాయి అంటూ అభిప్రాయపడ్డాడు. పాకిస్తాన్ జట్టు లో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. బాబర్, రిజ్వాన్ లాంటి స్టార్ బ్యాట్స్మెన్ లకు కొదవలేదు. ఇక పాకిస్తాన్ తో పాటు ఆస్ట్రేలియా కచ్చితంగా ఫైనల్ చేరుతుంది. అందుకే ఫైనల్ లో ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది అంటూ నాథున్ లయన్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: