ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టి20 ప్రపంచ కప్ టోర్నీకి సమయం ఆసన్నమైంది. జూన్ రెండవ తేదీ నుంచి అంటే రేపటి నుంచి ఈ టోర్ని ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. మొత్తంగా 20 టీమ్స్ ఈ ప్రపంచకప్ టోర్నీలో పాల్గొంటూ ఉండడం గమనార్హం. వెస్టిండీస్, యూఎస్ వేదికలుగా ఇక ఐసీసీ ఈవెంట్ జరగబోతుంది. ఈ క్రమంలోనే ఈ ప్రపంచకప్ టోర్నిని వీక్షించేందుకు అటు ప్రేక్షకులు అందరూ కూడా సిద్ధమైపోయారు.


 అయితే ఇలా ప్రపంచకప్ టోర్ని జరిగినప్పుడల్లా icc కొత్త రూల్స్ తీసుకురావడం చేస్తూ ఉంటుంది. ఇక ఈసారి కూడా ప్రపంచకప్ లో ఇలాంటి కొత్త రూల్ తీసుకువచ్చింది అన్నది తెలుస్తుంది. దీంతో ఈ కొత్త రూల్ బౌలర్లను మరింత టెన్షన్ పెట్టే అవకాశం ఉంది అని అందరూ అనుకుంటున్నారు. ఆ నియమమే స్టాప్ క్లాక్ రూల్.. టి20 వరల్డ్ కప్ లో నిర్ణీత సమయంలో తమ ఓవర్లను పూర్తి చేయని జట్లకు ఈ నియమం కచ్చితత్వంతో కూడుకున్నది అని చెప్పాలి. ఇక ఈ వరల్డ్ కప్ నుంచి వైట్ బాల్ ఫార్మాట్లో స్టాప్ క్లాక్ రూల్ ని ఉపయోగించాలని ఐసీసీ నిర్ణయించిందట.


 అయితే ఐసీసీ తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధన ప్రకారం.. రెండు ఓవర్ల మధ్య ఒక జట్టు తర్వాత ఓవర్ ప్రారంభించడానికి 60 సెకండ్లు ఇవ్వనున్నారు. ఆ టైం లోపే బౌలింగ్ జట్టు తదుపరి ఓవర్ ను ప్రారంభించాలి. ఒక ఓవర్ ముగిసిన వెంటనే థర్డ్ అంపైర్ ఈ నిబంధనలను అమలు చేస్తాడు. ఇక మైదానంలో ఉన్న పెద్ద స్క్రీన్ పై 60 సెకండ్ల గడువు కూడా కనిపిస్తుంది. ఈ గడువులోపు ఓవర్ ప్రారంభం కాకపోతే ఆన్ ఫీల్డ్ ఎంపైర్ బౌలింగ్ జట్టుకి రెండు హెచ్చరికలు జారీ చేస్తాడు. ఇక మూడవ హెచ్చరికపై ఐదు పరుగుల పెనాల్టీ విధించబడుతుంది. ఇక ఈ పరుగులు అటు బ్యాటింగ్ జట్టు ఖాతాలో చేరిపోతాయి అని చెప్పాలి  అయితే ఈ రూల్ ఏకంగా 20 నిమిషాల సమయాన్ని ఆదా చేస్తుందని icc గుర్తించిందట. అయితే క్రీజులోకి కొత్త బ్యాట్స్మెన్ వచ్చినప్పుడు.. లేదంటే అధికారిక పానీయాల విరామం సమయంలో.. బ్యాట్స్మెన్ లేదా ఫీల్డర్ కు గాయమైనప్పుడు.. ఫీల్డింగ్ జట్టు సమయం కోల్పోకుండా ఉంటే ఈ నియమం పరిగణలోకి తీసుకోబడదట.

మరింత సమాచారం తెలుసుకోండి: