ఈ క్రమంలోనే కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఇలా ఐపిఎల్ టైటిల్ గెలవడానికి ఒక ప్లేయర్ అద్భుతమైన ప్రదర్శన కారణమంటూ కోల్కతా జట్టు మెంటార్గా వ్యవహరించిన గౌతమ్ గంభీర్ అన్నాడు. ఆస్ట్రేలియా స్టార్ ఫేసర్ మిచెల్ స్టార్క్ అద్భుతంగా ఆడటంతోనే నాకౌట్ మ్యాచ్ లలో తమ జట్టు విజయం సాధించగలిగింది అంటూ చెప్పుకొచ్చాడు మిచెల్ స్టార్క్ తమకు ఎక్స్ ఫాక్టర్ గా మారతాడని ముందే ఊహించాం. అందుకే అతనిపై కోట్ల రూపాయలు కుమ్మరించాం అంటూ స్పష్టం చేశారు.
స్టార్క్ మాకు అత్యంత కీలకమైన బౌలర్ అని నిన్ను మొదటి నుంచి చెబుతూనే ఉన్నా. ఆరంభంలో అతను ఇబ్బంది పడ్డాడు ఇక్కడ పరిస్థితులకు అలవాటు పడేందుకు కాస్త సమయం పట్టింది. కానీ సరైన సమయంలో టచ్ లోకి వచ్చాడు. ఐపిఎల్ లో భారీ మ్యాచ్లు అంటే క్వాలిఫైయర్ ఫైనల్ మ్యాచ్ లలో రాణిస్తేనే టైటిల్ గెలవగలరు. మా జట్టు విషయంలో అదే జరిగింది. స్టార్క్ అసాధారణ ప్రదర్శన మమ్మల్ని విజేతగా నిలబెట్టింది అంటూ గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు. ఇక ఫైనల్లో అభిషేక్ శర్మను అవుట్ చేసిన బంతిపై మాట్లాడుతూ.. ఇలాంటి బంతిని సంధించిన బౌలర్ను అభినందించకుండా ఉండలేం. క్రికెట్లో అతి తక్కువ బంతులను మాత్రమే ఆడలేం అనుకుంటాం. అలాంటిదే ఆ బంతి అంటూ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు.