ఇలా రోహిత్ శర్మ ఐపీఎల్లో సూపర్ సక్సెస్ అయ్యాడు కాబట్టే అతనికి టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు కూడా వచ్చాయి అని చెప్పాలి ఇలా కోహ్లీ నుంచి కెప్టెన్సీ బాధ్యతలను అందుకున్న రోహిత్ శర్మ.. తన సారథ్యంతో అదరగొట్టేసాడు. టీమిండియాని మూడు ఫార్మాట్లలో కూడా విజయపతంలో ముందుకు నడిపించడంలో సక్సెస్ అయ్యాడు. ఈ క్రమంలోనే కెప్టెన్గా అతని విన్నింగ్ పర్సంటేజ్ కూడా అద్భుతంగా ఉంది అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు రోహిత్ శర్మ సారధ్యంలోనే టీమ్ ఇండియా టి20 వరల్డ్ కప్ లో బరిలోకి దిగింది. ఇటీవల ఐర్లాండ్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో ఘన విజయాన్ని అందుకుంది అని చెప్పాలి.
అయితే ఈ మ్యాచ్ లో విజయం ద్వారా అటు రోహిత్ శర్మ కెప్టెన్ గా ఒక అరుదైన రికార్డు సృష్టించాడు. టి20 ఫార్మాట్లో భారత జట్టుకు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్గా నిలిచాడు. సారధిగా వ్యవహరించిన 55 మ్యాచ్ లలో రోహిత్ శర్మ 42 విజయాలను అందుకున్నారు. ఆ తర్వాత స్థానంలో మహేంద్రసింగ్ ధోని 72 మ్యాచ్లలో 41 విజయాలు అందించి రెండవ ప్లేస్ లో ఉన్నాడు. మరోవైపు వన్డే ఫార్మాట్ లో అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్గా ధోని, టెస్టుల్లో కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నారు అని చెప్పాలి. కాగా టీమిండియా జూన్ 9వ తేదీన చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడబోతుంది.