గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వరల్డ్ కప్ టోర్నీలో ఒకవైపు తొడ కండరాలు పట్టేసి నడవలేని స్థితిలో ఉన్న క్రీజులో నిలబడి అతను సిక్సర్లు పోర్లతో చలరేగిపోయి డబుల్ సెంచరీ బాదిన తీరు ఎప్పటికీ క్రికెట్ ప్రేక్షకులు మరిచిపోలేరు అని చెప్పాలి. అందుకే మాక్స్వెల్ ఎంత ప్రమాదకరమైన బ్యాట్స్మెన్ అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ అలాంటి మాక్స్ వెల్ మొన్నటికి మొన్న ముగిసిన ఐపీఎల్ తోనే లో ఎంత దారుణంగా విఫలమయ్యాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరుపున ఆడిన అతను ఒక్క మ్యాచ్లో కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు అని చెప్పాలి. అయితే ఐపిఎల్ అతను ఇలాగే ఆడతాడు. కానీ వరల్డ్ కప్ లో మాత్రం ఆస్ట్రేలియా తరపున వీరోచితమైన ఇన్నింగ్స్ లతో చెలరేగిపోతాడు అని అందరూ అనుకున్నారు.
ఎందుకంటే గతంలో ఐపీఎల్ లో చెత్త ప్రదర్శన చేసి ఆస్ట్రేలియా తరపున మాత్రం అదరగొట్టేసాడు. ఇక ఇప్పుడు వరల్డ్ కప్ లో కూడా అలాగే ఆడతాడు అనుకుంటే.. ప్రపంచ కప్ లో కూడా అతని ఆట పేరు అస్సలు మారలేదు. టి20 వరల్డ్ కప్ లో కూడా అతను దారుణంగా విఫలం అవుతూనే ఉన్నాడు. ఇటీవలే పసికూన అయిన ఒమన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఎదుర్కున్న తొలి బంతికే.. క్యాచ్ అవుట్ అయి గోల్డెన్ డక్ గా పెవిలియన్ చేరాడు. అయితే గత పది టి20 లలో అతనికి ఇది ఐదవ డెకౌట్ కావడం గమనార్హం. ఈ ఏడాది ఐపీఎల్లో మాక్స్వెల్ 10 మ్యాచ్లు ఆడి కేవలం 52 పరుగులు మాత్రమే చేశాడు.