
వాస్తవానికి హార్దిక్ పాండ్యా జడ్డులో ఉండడం మంచిదే. ఎందుకంటే అతనికి మించిన ప్లేయర్ మరొకరు లేరు. అతను జట్టులో ఉంటే ఒక బౌలర్ తో పాటు అదనంగా స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ జట్టులో ఉన్నట్లు అవుతుంది. కానీ అతను ఐపీఎల్లో ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో అతన్ని వరల్డ్ కప్ లోకి సెలక్ట్ చేయరు అని అందరూ అనుకుంటుండగా.. సెలెక్టర్లు మాత్రం అతన్ని జట్టులోకి తీసుకున్నారు దీంతో అతన్ని కంటే టాలెంటెడ్ ప్లేయర్స్ ఎంతోమంది ఉన్నారని. అతన్ని కావాలని ఎందుకు సెలెక్ట్ చేశారు అంటూ విమర్శలు కూడా వచ్చాయి.
అయితే హార్దిక్ పాండ్యా పుంజుకొని మళ్ళీ ఫామ్ లోకి వస్తాడు అంటూ టీమ్ ఇండియా సెలెక్టర్లు ధీమా వ్యక్తం చేశారు. ఇక వారి నమ్మకాన్ని నిలబెడుతూ హార్దిక్ అదరగొడుతున్నాడు మొన్నటి వరకు ఐపిఎల్ లో ఎక్కడ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయని హార్దిక్.. ఇటీవల ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్ లో మాత్రం సూపర్ పర్ఫామెన్స్ చేశాడు. ఐర్లాండ్ తో మ్యాచ్లో సూపర్ బౌలింగ్ వేసిన అతను (4-127-3) గణాంకాలు నమోదు చేశాడు. మంచి లయ మీద కనిపిస్తూ వైవిద్యమైన బంతులతో బ్యాట్స్మెన్లను ఇబ్బంది పెట్టాడు. దీంతో ఐపీఎల్ సమయంలో హార్దిక్ పాండ్యా ని ఎందుకు సెలెక్ట్ చేశారు అంటూ విమర్శలు చేసిన వాళ్లే మీరు మారిపోయారు సార్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ ఉన్నారూ అని చెప్పాలి.