అద్భుతంగా రాణిస్తాయి అని భారీ అంచనాలతో బరిలోకి దిగిన అగ్రశ్రేణి టీమ్స్ చెత్త ప్రదర్శన చేస్తూ నిరాశ పరుస్తూ ఉంటే.. ఎలాంటి అంచనాలు లేకుండా తమ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన చిన్న టీమ్స్ మాత్రం అదరగొట్టేస్తూ ఉన్నాయి. ఏకంగా ఛాంపియన్ టీమ్స్ కి సైతం షాక్ ఇస్తూ వరుస విజయాలు సాధిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. దీంతో ఈ వరల్డ్ కప్ టోర్నీలో ఏ జట్టు ఎప్పుడు సంచలన విజయాన్ని నమోదు చేస్తుంది అనే విషయం తెలియక.. ప్రతి మ్యాచ్ ని కూడా కన్నార్పకుండా చూసేస్తూ ఉన్నారు ప్రేక్షకులు. ఇలా t20 వరల్డ్ కప్ 2024 టోర్నిలో చిన్న టీమ్స్ సంచలనాలు సృష్టిస్తున్నాయి అనడానికి ఇప్పుడు కొన్ని గ్రూపులలో టాప్ లో ఉండడమే సాక్ష్యం అని చెప్పాలి.
ఏకంగా నాలుగు గ్రూపుల్లో మూడు చిన్న టీమ్స్ టేబుల్ టాపర్లు గా ఉన్నాయి. గ్రూప్ ఎ నాలుగు పాయింట్లతో యూఎస్ఏ టాప్ లో ఉండగా, గ్రూప్ బి లో మూడు పాయింట్లతో స్కాట్లాండ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక గ్రూప్ సీలో నాలుగు పాయింట్లతో ఆఫ్ఘనిస్తాన్ టాపర్లుగా ఉన్నాయి అని చెప్పాలి. గ్రూప్ డి లో మాత్రం పటిష్టమైన జట్టుగా చెప్పుకునే దక్షిణాఫ్రికా రెండు పాయింట్స్ తో తొలి స్థానంలో ఉంది. అయితే మ్యాచ్ లు జరిగే కొద్ది టేబుల్ టాపర్లు మారే అవకాశం ఉంది. కానీ ఇప్పటికే యూఎస్ఏ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ న్యూజిలాండ్ జట్ల గురించి సంచలన విజయాలను నమోదు చేశాయి అని చెప్పాలి.