దీంతో అన్ని దేశాల లాగా అటు ఈ రెండు దేశాలు.. ఒక దేశ పర్యటనకు మరో దేశం వెళ్లడం.. ద్వైపాక్షిక సిరీస్ లు ఆడటం అస్సలు జరగదు. ఎందుకంటే క్రికెట్ సంబంధాలపై నిషేధం ఉన్న నేపథ్యంలో కేవలం ఐసిసి టోర్నీలో మాత్రమే ఈ రెండు టీమ్స్ తలబడుతూ ఉంటాయి. ఇక ఎప్పుడో ఒకసారి జరిగే ఈ దాయాదుల పోరును చూసేందుకు రెండు దేశాల క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు క్రికెట్ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ప్రస్తుతం వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ పోరులో భాగంగా ప్రేక్షకులందరూ ఎదురుచూసిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ నేడే జరగబోతుంది. ఈ క్రమంలోనే ఈ దాయాదుల పోరును చూసేందుకు ప్రపంచ క్రికెట్ ప్రజానీకం సిద్ధమైంది.
న్యూయార్క్ వేదికగా ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ అందింది. ఎందుకంటే ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉందని ఆక్యు వెదర్ పేర్కొంది. అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 11గంటలకు అంటే ఇండియాలో రాత్రి 8:30 గంటలకు 51% వరకు వర్షం పడే అవకాశం ఉంది అంటూ తెలిపింది. అయితే ఆ తర్వాత సాయంత్రం నాలుగు గంటల వరకు 45 నుంచి 50% వర్ష సూచన ఉండడంతో మ్యాచ్ రద్దు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ తెలిపింది. అయితే వరుణుడు కరుణించి మ్యాచ్ రద్దు అవ్వకుండా ఉంటే బాగుండు అని ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు కోరుకుంటున్నారు.