ప్రస్తుతం వెస్టిండీస్, యూఎస్ వేదికలుగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ టోర్ని ఎంత ఉత్కంఠ భరితంగా సాగుతుంది. అయితే ప్రేక్షకులు అందరూ ఊహించినట్లుగా ఆయా మ్యాచ్ లలో భారీ స్కోర్ నమోదు కాకపోయినప్పటికీ ఇక లో స్కోరింగ్ కూడా చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లుగా ఉత్కంఠ భరితంగా సాగుతూ ప్రేక్షకులకు అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ పంచుతుంది. ఈ క్రమంలోనే ఇక ఏ మ్యాచ్ జరిగిన కూడా మిస్ చేయకుండా ప్రేక్షకులందరూ టీవీలకు అతుక్కుపోయి మరి వరల్డ్ కప్ ని చూసేస్తున్నారు.



 అయితే ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో కూడా నువ్వా నేనా అన్నట్లుగా పోరు జరగగా.. చివరికి అటు సౌత్ ఆఫ్రికా జట్టు అతి కష్టం మీద విజయం సాధించింది అని చెప్పాలి. అయితే బంగ్లాదేశ్ ఓడిపోయిన నేపథ్యంలో.. ఆ దేశ అభిమానులు నిరాశలో మునిగిపోయారు. అంపైర్ చేసిన తప్పిదమే బంగ్లాదేశ్ ఓటమికి కారణం అంటూ కొంతమంది షాకింగ్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఎంపైర్ తప్పుడు నిర్ణయం ఐసిసి రూల్స్ కారణంగానే బంగ్లాదేశ్ ఓటమి పాలైందంటూ కామెంట్లు చేస్తుండగా.. కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి.


 ఇంతకీ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఏం జరిగిందంటే.. సౌత్ ఆఫ్రికా పై 17వ ఓవర్ లో రెండవ బంతికి బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ మహమ్మదుల్లాను అంపైర్ ఎల్బి డబ్ల్యు గా ప్రకటించాడు. అయితే ఆ బంతి ప్యాడ్ కు తగిలి బౌండరీకి వెళ్ళింది. కాగా బంగ్లాదేశ్ రివ్యూ కి వెళ్ళగా అది నాటౌట్ గా తేలింది. కానీ రూల్ ప్రకారం ఎంపైర్ నిర్ణయం తీసుకోగానే ఆ బాల్ డెడ్ బాల్ గా మారిపోతుంది. దీంతో అంపైర్ ఎల్పిడబ్ల్యుగా నిర్ణయం తీసుకున్న నేపద్యంలో ఆ బాల్ ఫోర్ గా వెళ్ళినప్పటికీ.. చివరికి డెడ్ బాల్ గా పరిగణించారు. దీంతో బంగ్లాదేశ్ ఖాతాలో నాలుగు పరుగులు చేరలేదు. ఇలా అంపైర్ తప్పిదం ఐసీసీ రూల్ కారణంగా చివరికి బంగ్లాదేశ్ ఓటమిపాలు అయ్యింది అంటూ ఆ జట్టు అభిమానులు అందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: