ప్రస్తుతం వెస్టిండీస్, యూఎస్ వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ టోర్నీలో టీమ్ ఇండియా మంచి ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది అన్న విషయం తెలిసిందే . అయితే వరుసగా విజయాలు సాధిస్తూ ఇప్పటికే సూపర్ 8 కి అర్హత సాధించింది టీం ఇండియా. అయితే భారత జట్టు ఇలా వరుసగా విజయాలు సాధిస్తున్నప్పటికీ జట్టులో ఉన్న కీలక ఆటగాళ్లు వరుసగా విఫలమవుతూ ఉండడం మాత్రం జట్టును ఆందోళనకు గురిచేస్తుంది. మరీ ముఖ్యంగా ఈ వరల్డ్ కప్ టోర్నీలో అదరగొడతాడు అనుకున్న విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలు ఎందుకో ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయడం లేదు.


 మరిముఖ్యంగా ఎప్పుడు అద్భుతమైన ప్రదర్శన చేసి జట్టు విజయాలలో కీలక పాత్ర వహించే విరాట్ కోహ్లీ ఇప్పటివరకూ జరిగిన మూడు మ్యాచ్లలో కూడా దారుణంగా విఫలమయ్యాడు అని చెప్పాలి  అయితే ఎప్పుడు వచ్చే తన రెగ్యులర్ బ్యాటింగ్ స్థానంలో కాకుండా ఓపెనర్ గా బరిలోకి దిగుతూ రోహిత్ శర్మతో కలిసి ఆడుతున్నాడు. కానీ ఓపనర్ గా అతనికి అస్సలు కలిసి రావట్లేదు. దీంతో తన అసలు స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు అనుకుంటే కోహ్లీ మాత్రం ప్రతి మ్యాచ్ లోను ఓపెనర్ గానే బరిలోకి దిగుతూ ఉండడం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే  కోహ్లీ తన బ్యాటింగ్ స్థానాన్ని మార్చుకోవాలి అంటూ ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా సలహాలు ఇస్తున్నారు.


 అయితే టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఇప్పటివరకు విరాట్ కోహ్లీ ఆడిన 3 మ్యాచ్లలో కూడా రాణించకపోవడంపై  భారత మాజీ ప్లేయర్ సునీల్ గవాస్కర్  స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ కాస్త ఓపిక అడిగితే మంచి ప్రదర్శన చేస్తాడని.. అతని ఫామ్ గురించి ఆందోళన అవసరం లేదు అంటూ సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు  దేశం కోసం ఆడేటప్పుడు మ్యాచ్లు గెలవడమే ఏ ఆటగాడికైనా స్ఫూర్తి అని ఆ విషయం విరాట్ కోహ్లీకి తెలుసు అంటూ చెప్పుకొచ్చాడు  అసలు ఆట సూపర్ 8, సెమి ఫైనల్ లో ఉంటుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు సునీల్ గవస్కర్

మరింత సమాచారం తెలుసుకోండి: