టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనికి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక రైల్వే టికెట్ కలెక్టర్ స్థాయి నుంచి ఏకంగా దేశం గర్వించదగ్గ క్రికెటర్ స్థాయికి ఎదిగిన ఆయన ప్రస్థానం.. ఎంతో మంది యువకులకు ఆదర్శప్రాయంగా నిలుస్తూ ఉంటుంది. భారత క్రికెట్ లోకి ఒక సాదాసీదా ఆటగాడిగా ఎంట్రీ ఇవ్వడమే కాదు.. ఏకంగా భారత జట్టుకు కెప్టెన్ గా కూడా అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగించారు. టీమిండియా కు అందని ద్రాక్షలా ఉన్న వరల్డ్ కప్ లు తన కెప్టెన్సీ లోనే రెండుసార్లు అందించాడు మహేంద్ర సింగ్ ధోని.


 ఇలా ఇండియన్ క్రికెట్ హిస్టరీ లో ఏ కెప్టెన్ కు సాధ్యం కానీ ఎన్నో అరుదైన రికార్డులను కూడా సృష్టించాడు అని చెప్పాలి. అలాంటి మహేంద్ర సింగ్ ధోని ఇక అటు కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు. బెస్ట్ ఫినిషర్గా బెస్ట్ వికెట్ కీపర్ గా బెస్ట్ కెప్టెన్ గా ఇలా అన్నింటిలో తాను బెస్ట్ అని నిరూపించుకున్నాడు. అందుకే ధోనిని ఇక అభిమానులు అందరూ కూడా తల అని పిలుచుకుంటూ ఉంటారు అని చెప్పాలి. అయితే ధోని సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండకపోయినప్పటికీ అతని గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది.


 ఇటీవలే ధోని రేంజ్ ఇది అంటూ మరో న్యూస్ వైరల్ గా మారిపోయింది. భారత దిగ్గజ క్రికెటర్ ధోని ఇంటర్నేషనల్ క్రికెట్కు గుడ్ బై చెప్పిన ఆయన క్రేజ్ ఇంకా తగ్గలేదు అన్న విషయం మరోసారి రుజువైంది. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన ఫిఫా ఇంస్టాగ్రామ్ లో ఫుట్బాల్ స్టార్ క్రికెటర్ క్రిస్టియన్ రోనాల్డో ఫోటోని షేర్ చేసింది. తలా ఫర్ యువర్ రీజన్ 7 అని రాసుకోచ్చింది. అయితే ఏకంగా ఫిఫా ఇంస్టాగ్రామ్ లో ఇలా రాసుకురావడంతో ధోని రేంజ్ ఇది అంటూ ఎంతోమంది ఫ్యాన్స్ ఇక సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. కాగా చెన్నై అభిమానులు అందరూ కూడా ధోనిని తలా అని పిలుస్తూ ఉంటారు. మరే క్రికెటర్ కి ఆటగాడికి ఇలాంటి పేరు లేదు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: