ప్రస్తుతం వెస్టిండీస్ యూఎస్  వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ 2024 టోర్నీ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రపంచ కప్ టోర్నీలో ప్రేక్షకులు అంచనాలు మొత్తం తారమారవుతున్నాయి. వరల్డ్ కప్ లో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన అగ్రశ్రేణి టీమ్స్ అద్భుతంగా రానిస్తాయని అందరూ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఊహించని రీతిలో పెద్ద టీమ్స్ అన్ని చెత్త ప్రదర్శన చేసి నిరాశ పరుస్తూ ఉంటే.. అటు చిన్న టీమ్స్ మాత్రం అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాయి.


 ఈ క్రమంలోనే టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన జట్లు కనీసం సూపర్ 8 కూడా చేరకుండా టోర్ని నుంచి నిష్క్రమిస్తే.. అటు ఎలాంటి అంచనాలు లేకుండా వరల్డ్ కప్ లో ప్రస్థానం మొదలు పెట్టిన కొన్ని చిన్న టీమ్స్ మాత్రం అదరగొట్టేస్తున్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటున్నాయి. అయితే నేటి నుంచి అందరూ ఎదురుచూస్తున్న సూపర్ 8 మ్యాచ్లు కూడా జరగబోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో ఉత్కంఠ భరితంగా సాగుతున్న వరల్డ్ కప్ టోర్నీలో ఫిక్సింగ్ కలకలం రేపేంది.


 తనను కొంతమంది బుకీలు సంప్రదించారు అంటూ ఒక ఉగాండా ప్లేయర్ ఏకంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిలకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఇది కాస్త సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే కెన్యాకు చెందిన ఒక మాజీ క్రికెటర్ పదే పదే ఫోన్లు చేసినట్లు ఆయన ఐసీసీకి సమాచారం ఇచ్చాడు అన్నది తెలుస్తుంది. అయితే దీనిపై ఐసీసీ యాంటీ కరప్షన్ యూనిట్ అధికారులు వెంటనే స్పందించారు. ఈ క్రమంలోనే దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా టి20 వరల్డ్ కప్ లో ఉగాండా  అర్హత సాధించడం ఇది మొదటిసారి అని చెప్పాలి. ఇకపోతే ఇప్పటివరకు వరల్డ్ కప్ టోర్నీలో ఏకంగా నాలుగు మ్యాచ్ లు ఆడిన ఉగాండా జట్టు కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc