![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/sports/libra_libra/shami513f5fa8-8810-43e4-a58a-90174493f301-415x250.jpg)
ఇలా తన కోసం ఎంతో త్యాగం చేసిన సానియా మీర్జాను.. అటు షోయబ్ మాలిక్ మాత్రం వదిలేశాడు. ఏకంగా విడాకులు తీసుకునేందుకు రెడీ అయ్యాడు అయితే విడాకుల ప్రకటన రాకముందే షోయబ్ మాలిక్ పాకిస్తాన్ నటి తో మూడో వివాహం చేసుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇది కాస్త సంచలనం గా మారిపోయింది. అయితే ఇలా తన భర్త షోయబ్ మాలిక్ చేసిన పనిపై అటు సానియా మీర్జా కూడా విమర్శలు చేసింది. ఇక సానియా మీర్జా విడాకులు తీసుకుందో లేదో ఆమె రెండో పెళ్లి గురించి వార్తలు మొదలయ్యాయి.
టీమిండియా స్టార్ ప్లేయర్ అయిన మహమ్మద్ షమిని సానియా మీర్జా రెండో వివాహం చేసుకోబోతుంది అంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే ఈ ప్రచారంపై ఇటీవలే సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా స్పందించారు. అదంతా చెత్త ప్రచారం. అసలు ఇప్పటివరకు మహమ్మద్ షమీని సానియా మీర్జా కలవనే లేదు అంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. అయితే సానియా మీర్జా అటు భర్త షోయబ్ మాలిక్ తో విడాకులు తీసుకోగా.. టీమిండియా స్టార్ క్రికెటర్ మహమ్మద్ షమీ తన భార్య హసన్ జోహన్ తో విడాకులు తీసుకొని ఒంటరిగానే ఉంటున్నాడు. దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు పుట్టుకొచ్చాయి.