2024 t20 వరల్డ్ కప్ టోర్నమెంట్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న పాకిస్తాన్ జట్టుపై ఎంత తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా ఆ జట్టు మాజీ ప్లేయర్లే పాక్ జట్టు తీరుపై ఇక తీవ్ర ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఈ వరల్డ్ కప్ టోర్నీలో పాకిస్తాన్ జట్టు కనీసం సూపర్ 8 కి కూడా చేరలేక చివరికి టోర్నీ నుంచి లీగ్ దశతోనే నిష్క్రమించింది. అమెరికా లాంటి పసికూన చేతిలో సైతం ఓడిపోయింది. దీంతో బాబర్ అజాం సారథ్యంలోని పాకిస్తాన్ జట్టు మ్యాచ్ ఫిక్సింగ్ కి పాల్పడింది అంటూ సామాజిక మాధ్యమాల్లో ఎన్నో ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి.


 ఇక పాకిస్తాన్ క్రికెటర్లు కూడా ఏదో ఒక విధంగా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఇలా పాక్ జట్టు మ్యాచ్ ఫిక్సింగ్ కి పాల్పడింది అంటూ వస్తున్న ఆరోపణలపై ఆ దేశ క్రికెట్ బోర్డు స్పందించింది. జట్టు సభ్యుల్ని వెనకేసుకొచ్చింది. మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినట్లు తమకు ఎలాంటి అనుమానాలు లేవు అంటూ వెల్లడించింది. దీనిపై విచారణ చేపట్టాల్సిన అవసరం కూడా లేదు అంటూ చెప్పుకొచ్చింది. ఆరోపణలు చేసిన వారు ఆధారాలతో రావాలి అంటూ కోరింది. ఎవరైనా మ్యాచ్ ఫిక్సింగ్ కి పాల్పడినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం అంటూ స్పష్టం చేసింది. అయితే విమర్శలు కొంత పరిధిలో ఆమోదయ యోగ్యమే. నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు సహకరిస్తాయి. కానీ ఓటమిపాలైనంత మాత్రాన మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడ్డారు అంటూ ఆరోపణలు చేయడం సహేతుకం అంటూ పిసిబి వర్గాలు పేర్కొన్నట్లు అక్కడ మీడియాలో కథనాలు కూడా వచ్చాయి.


 అదే సమయంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రతిష్టను తగ్గించే విధంగా నిరాధార ఆరోపణలు చేసిన వారికి లీగల్ నోటీసులు పంపించేందుకు కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది  ఒకవేళ ఇలా ఆరోపణలు చేసిన వారు తగిన ఆధారాలు సమర్పించకపోతే పరువు నష్టం దావా వేసే ఆలోచనలో పిసిబో ఉన్నట్లు తెలుస్తోంది. పాక్ లోని నిబంధనల ప్రకారం ఇలాంటి తరహా కేసుల్లో గరిష్టంగా ఆరు నెలల్లోగా తీర్పు వెలువబడుతుంది అన్న విషయం తెలుస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Pcb