
ఫైనల్ మ్యాచ్ వరకు కూడా ఒక్క ఓటమి లేకుండా వరుస విజయాలతో దూసుకుపోయిన టీమ్ ఇండియా.. ఫైనల్ లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి నిరాశపరిచింది. అయితే ఇక ఇప్పుడు వెస్టిండీస్, యూఎస్ వేదికగా జరుగుతున్న 2024 t20 వరల్డ్ కప్ టోర్నీలో మాత్రం ఎలాంటితప్పిదాలు చేయకుండా జాగ్రత్త పడుతుంది. ఇప్పటికే లీగ్ దశలో వరుసగా మూడు మ్యాచ్ లలో విజయం సాధించి సూపర్ 8 లో అడుగు పెట్టింది. ఇక సూపర్ 8లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లలో కూడా విక్టరీని సాధించింది. మొదటి మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన పరులు 47 పరుగులు తేడాతో విజయం సాధించిన టీమిండియా ఇటీవల బంగ్లాదేశ్ తో మ్యాచ్ ఆడింది.
ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ తో జరిగిన పోరులో కూడా అదరగొట్టేసింది. ఏకంగా 50 పరుగులు తేడాతో బంగ్లాదేశ్ ను చిత్తుగా ఓడించింది. ఈ క్రమంలోనే వరుసగా రెండు విజయాలు సాధించిన టీమ్ ఇండియాకు.. దాదాపుగా సెమీఫైనల్ బెర్త్ ఖరారు అయిపోయినట్లే.. దీంతో టీమ్ ఇండియా అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగిపోయారు అని చెప్పాలి. కాగా మొదటి బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 196 పరుగులు చేయగా.. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన బంగ్లా ఓవర్లన్ని ఆడి 146 / 8కే పరిమితమైంది. దీంతో ఇక ఆ జట్టు 50 పరుగుల తేడాతో ఓడిపోయింది అని చెప్పాలి.