టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గురించి ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే అద్భుతమైన ప్రదర్శనతో అందరికీ సుపరిచితుడుగా మారిపోయాడు ఈ స్టార్ ప్లేయర్. అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన అతి తక్కువ సమయంలోనే.. తాను లెజెండరీ క్రికెటర్ ను అన్న విషయాన్ని నిరూపించుకున్నాడు. ఎంతో మంది దిగ్గజ ఆటగాళ్లు కెరియర్ కాలం మొత్తంలో సాధించిన రికార్డులను ఎంతో అలవోకక బద్దలు కొట్టి తనకు తిరుగులేదు అని నిరూపించుకున్నాడు.


 అయితే ఇప్పుడు వరకు విరాట్ కోహ్లీ సాధించిన రికార్డులు అన్ని ఇన్ని కావు. కానీ ఇంకా కొత్తగా జట్టులోకి వచ్చిన ఆటగాడిలాగానే ఏదో నిరూపించుకోవాలి అనే కసి  కోహ్లీలో ప్రతి మ్యాచ్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక ప్రతి పోరుని కూడా డూ ఆర్ డై  మ్యాచ్ అన్నట్లుగానే విరాట్ కోహ్లీ ఆడుతూ ఉంటాడు అని చెప్పాలి. కాగా ప్రస్తుతం అటు టి20 వరల్డ్ కప్ లో భాగంగా టీమ్ ఇండియాలో కీలక ఆటగాడిగా వ్యవహరిస్తున్న కోహ్లీ.. గత కొంతకాలం నుంచి మాత్రం ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పాలి. అయితే సూపర్ 8 దశలో ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన కీలకమైన పోరులో మాత్రం కోహ్లీ పర్వాలేదు అనిపించాడు. ఏకంగా 37 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.


 అయితే ఇక ఎప్పుడు విరాట్ కోహ్లీ ఖాతాలో మరో అరుదైన రికార్డు వచ్చి చేరిపోయింది. టి20 వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ లలో 3000 పరుగులు చేసిన తొలి బ్యాట్స్మెన్ గా చరిత్ర సృష్టించాడు విరాట్ కోహ్లీ. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్లో 37 పరుగులు చేసిన విరాట్ ఏకంగా మొత్తం 67 ఇన్నింగ్స్ లో 3002 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత స్థానంలో రోహిత్ 2637 పరుగులు, వార్నర్ 2352, సచిన్ 2278, సంఘకర 2193, షకీబ్ అల్ హసన్ 2174, గేల్ 2151 పరుగులతో ఉన్నారు. కాగా బంగ్లాదేశ్ పై విజయం సాధించిన టీమిండియా అటు సెమీఫైనల్ బెర్త్ దాదాపుగా ఖరారు చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: