ప్రస్తుతం వెస్టిండీస్, యూఎస్ వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ టోర్ని ఎంత ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొన్నటి వరకు లీగ్ దశ మ్యాచ్ లు అన్నీ కూడా యూఎస్ వేదికగా జరిగాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు సూపర్ 8 లాంటి కీలక దశ మ్యాచ్ లన్ని వెస్టిండీస్ వేదికగా జరుగుతూ ఉండడం గమనార్హం. కాగా ఈ వరల్డ్ కప్ లో అటు అందరి అంచనాలు కూడా తారుమారు అయ్యాయి అని చెప్పాలి. ఎప్పటిలాగానే అగ్రశ్రేణి టీమ్స్ అద్భుతంగా రాణిస్తాయి అని అందరూ అనుకున్నప్పటికీ.. ఊహించని రీతిలో చిన్న టీమ్స్ అదరగొట్టేసాయి.


 దీంతో న్యూజిలాండ్, పాకిస్తాన్ లాంటి మాజీ ఛాంపియన్ టీమ్స్ కి సైతం ఇక చివరికి ఓటమి తప్పలేదు. ఇలాంటి టీమ్స్ కేవలం లీగ్ దశతోనే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాయి అని చెప్పాలి. ఇక మరోవైపు ప్రస్తుతం సూపర్ 8 మ్యాచ్లు కూడా ఎంతొ ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉన్నాయి. ఇక టీమిండియా ఎప్పటిలాగానే అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది. కాగా అటు వెస్టిండీస్, యుఎస్ లలో బౌలింగ్ పిచ్ లు ఉండడంతో బౌలర్లు చెలరేగిపోతున్నారు. దీంతో ఇక్కడ పరుగులు చేయడం బ్యాట్స్మెన్ లకు ఇబ్బందికరంగా మారిపోయింది.


 దీంతో ఆయా మ్యాచ్ లలో లో స్కోరింగ్  నమోదవుతూ ఉండడం గమనార్హం. అయితే ఇలా లో స్కోరింగ్ నమోదు అవుతున్నప్పటికీ.. ఒకవైపు బౌలర్లు సత్తా చాటుతున్నప్పటికీ బ్యాటర్ల సిక్సర్ల జోరు మాత్రం ఆగడం లేదట. ఏకంగా వరల్డ్ కప్ హిస్టరీలో అత్యధిక సిక్సర్లు 412 నమోదైన సీజన్ గా 2024 t20 వరల్డ్ కప్ నిలిచింది. 2021 లో 405 సిక్సర్లు బాధగా.. ఇప్పుడు వరకు ఇదే అత్యధికంగా ఉంది. కాగా ఇప్పుడు ఈ రికార్డు బ్రేక్ అయింది. ఈ వరల్డ్ కప్ లో మరిన్ని మ్యాచ్లు మిగిలి ఉన్న నేపథ్యంలో 500 సిక్సర్ల మార్క్ చేరుకునే అవకాశం ఉందని క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: