టి20 వరల్డ్ కప్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతూ ప్రేక్షకులందరికీ అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పంచుతుంది అన్న విషయం తెలిసిందే. అదే సమయంలో ప్రేక్షకులందరికీ కూడా అంచనాలను  తారుమారు చేస్తుంది. ఎందుకంటే ఎప్పటిలాగానే అద్భుతంగా రానిస్తాయి అనుకున్న ఛాంపియన్ టీమ్స్ ఈ వరల్డ్ కప్ టోర్నీలో చెత్త ప్రదర్శన చేసి నిష్క్రమించాయ్. కాగా ప్రస్తుతం వరల్డ్ కప్ టోర్నీలో కీలకమైన సూపర్ 8 దశ మ్యాచ్ లు జరుగుతున్నాయ్ జరుగుతుంది. ఇక నువ్వా నేనా అన్నట్లుగా అన్ని టీమ్స్ కూడా హోరాహోరీగా పోరాటం సాగిస్తూ ఉన్నాయి అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే సూపర్ 8 దశలో భాగంగా జరుగుతున్న మ్యాచ్ లు  కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉండడం గమనార్హం. కాగా ఇక ఇటీవల ఈ వరల్డ్ కప్ లో భాగంగా జరిగిన ఒక మ్యాచ్ లో సంచలనం నమోదు అయింది. అమెరికాతో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ బౌలర్ క్రిస్ జోర్దన్ హ్యాట్రిక్ నమోదు చేశాడు  అంతేకాకుండా ఒకే ఓవర్ లో నాలుగు వికెట్లు తీసి అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు  అని చెప్పాలి. ఇప్పటికే ఈ వరల్డ్ కప్ టోర్నీలో ఎంతోమంది బౌలర్లు తమ కెరియర్ లోనే అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఉండగా.. ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ బౌలర్ క్రిస్ జోర్డాన్ సైతం ఇలాంటి ప్రదర్శన చేశాడు.


 నాలుగు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు అని చెప్పాలి. ఇలా అమెరికాతో జరిగిన మ్యాచ్లో 19 ఓవర్ వేసిన క్రిష్ జోర్దాన్ తొలి బంతికి కోరి అండర్సన్ వికెట్ తీసి వెనక్కి పంపాడు  ఆ తర్వాత మూడు, నాలుగు, ఐదు బంతుల్లో వరుసగా అలీ ఖాన్, నోతోష్, నేత్రావల్కర్ ను అవుట్ చేశాడు. అంతకు ముందు జరిగిన మ్యాచ్ లోనే ఆఫ్గనిస్తాన్ పై ఇంగ్లాండ్ బౌలర్  కమిన్స్ హ్యాట్రిక్ నమోదు చేయగా.. ఇక ఇప్పుడు తర్వాత మ్యాచ్ లోనే క్రిస్ జోర్డాన్ కూడా ఈ రికార్డును అందుకున్నాడు. ఇక ఇప్పటివరకు ఈ వరల్డ్ కప్ టోర్నీలో మూడు హ్యాట్రిక్ లు నమోదు కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc