ఎన్నో రోజులుగా ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా అలరిస్తూ వచ్చిన వరల్డ్ కప్ టోర్నీ ప్రస్తుతం తుది అంకానికి చేరుకుంటుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే గత ప్రపంచకప్ టోర్నీలో భాగంగా మొన్నటి వరకు అటు సూపర్ 8 లో మ్యాచ్లు జరిగాయి. ఇక ఎప్పుడూ ఈ పోరు సెమీఫైనల్ కు చేరుకుంది అని చెప్పాలి. కాగా నేడు కీలకమైన రెండు సెమి ఫైనల్ లు జరగబోతున్నాయ్. దీంతో ఇక ఈ వరల్డ్ కప్ టోర్నమెంట్లో ఫైనలిస్టులు ఎవరు అన్న విషయం నేడే తేలబోతుంది అని చెప్పాలి.


 ఒకవైపు ఉదయం 6 గంటల నుంచి ఆఫ్ఘనిస్తాన్, సౌత్ ఆఫ్రికా మధ్య మొదటి సెమి ఫైనల్ మ్యాచ్ జరుగుతూ ఉండగా మరోవైపు అటు టీమిండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఏ జట్టు ఫైనల్ కు చేరుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఈ రెండు సెమి ఫైనల్ మ్యాచ్ లను మిస్ చేయకుండా ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారు అని చెప్పాలి. కాగా అటు సౌత్ ఆఫ్రికా, ఆఫ్గనిస్తాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఏ జట్టు గెలిచిన చరిత్ర సృష్టించినట్లు అవుతుంది.


 కాగా t20 వరల్డ్ కప్ లో భాగంగా నేడు జరుగుతున్న మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో అటు దక్షిణాఫ్రికా, ఆఫ్గనిస్తాన్ జట్లు తలబడుతున్నాయి. అయితే టి20 వరల్డ్ కప్ చరిత్రలోనే ఈ రెండు టీమ్స్ ఎప్పుడు కూడా ఫైనల్ కు చేరలేదు. దీంతో ఏ జట్టు సెమి ఫైనల్లో విజయం సాధించి ఫైనల్ లో అడుగుపెట్టిన అది హిస్టరీనే అని చెప్పాలి. ట్రనిడాడ్ లో పిచ్ మందకోడి కావడంతో తక్కువ స్కోరులే నమోదయ్యే అవకాశం ఉంది. అయితే మ్యాచ్ కు వర్షం ముప్పు లేదు అని వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే మాత్రం దక్షిణాఫ్రికా జట్టు ఇక కొన్ని గణాంకాల కారణంగా ఫైనల్లో అడుగుపెడుతుంది అనిచెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: