భారత క్రికెట్లో కొత్త ప్రతిభకు కొదవ లేకుండా పోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు ఎంతో మంది యువ ఆటగాళ్ళు తమ సత్తా ఏంటో నిరూపించుకుని భారత జట్టులో తమ స్థానాన్ని సుస్థిరం  చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక ఐపీఎల్ సహా దేశవాళి టోర్నీలలో కూడా అదరగొట్టేస్తూ భారత జట్టులో తాము కొని స్థానాలకు పర్ఫెక్ట్ ఛాయిస్ అంటూ నిరూపించుకుంటున్నారు. అయితే ఈ ఏడాది ముగిసిన ఐపీఎల్ సీజన్లో కూడా ఇలా ఎంతో మంది యంగ్ ప్లేయర్స్ అదరగొట్టేసారు.


 మరి ముఖ్యంగా తెలుగు ప్లేయర్ నితీష్ రెడ్డి వచ్చిన అవకాశాన్ని ఎంతలా సద్వినియోగం చేసుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తూ ఇక అదరగొట్టేస్తున్నాడు. తన బ్యాటింగ్ తో ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిలాగానే ఆడుతూ అందరిని మైమరిపించాడు. ఈ క్రమంలోనే అతి త్వరలోనే అతను భారత జట్టులోకి వచ్చే అవకాశం ఉందని అందరు అనుకున్నారు. ఊహించినట్లుగానే అటు జింబాబ్వే పర్యటన కోసం భారత సెలెక్టర్లు నితీష్ రెడ్డికి జట్టులో ఛాన్స్ కల్పించారు.  ఇలా తక్కువ సమయంలోనే బంపర్ ఆఫర్ దక్కించుకున్నాడు ఈ ప్లేయర్.


 కానీ ఇలా లక్కీ ఛాన్స్ దక్కించుకున్న ఈ తెలుగు ప్లేయర్ ను అటు దురదృష్టం కూడా వెంటాడింది అన్నది తెలుస్తుంది  ఎందుకంటే జింబాబ్వే పర్యటనకు భారత జట్టులో తొలిసారి చోటు దక్కించుకున్న తెలుగు ప్లేయర్ నితీష్ రెడ్డి.. చివరికి గాయం కారణంగా జట్టుకు దూరం కాబోతున్నాడట. నితీష్ రెడ్డి గాయం కారణంగా జింబాబ్వే తో జరగబోయే టి20 సిరీస్లో ఆడటం లేదు అని బీసీసీఐ వెల్లడించింది. ఇక అతని  ఆరోగ్య పరిస్థితిని మెడికల్ టీం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. కాగా నితీష్ రెడ్డికి గాయం కావడంతో అతని స్థానంలో శివం దుబేకి జింబాంబే పర్యటనలో ఆడే ఛాన్స్ దక్కబోతుంది అన్నది సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: