వెస్టిండీస్, యుఎస్ వేదికలుగా జరుగుతున్న టి20 ప్రపంచకప్ 2024 ఎడిషన్ లో భారత జట్టు ఎంత అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూఎస్ లోని స్లో పిచ్ లపై అన్ని టీమ్స్ తడబడితే.. అటు భారత జట్టు మాత్రం ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తూనే వచ్చింది. ఒక్క ఓటమి లేకుండా సెమీఫైనల్ వరకు దూసుకు వచ్చింది అని చెప్పాలి. కాగా నేడు సెమీఫైనల్ లో కీలకమైన మ్యాచ్ ఆడబోతుంది . డిపెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టుతో సెమీ ఫైనల్లో తలబడబోతుంది అని చెప్పాలి.


 అయితే అటు బ్యాటింగ్ విభాగంలో బౌలింగ్ విభాగంలో ఎంతో పటిష్టంగా కనిపిస్తున్న టీమిండియా ఇంగ్లాండ్ జట్టును ఎంతో అలవోకగా ఓడించడం ఖాయమని భారత అభిమానులు అందరూ కూడా నమ్ముతున్నారు. అయితే ఇంగ్లాండ్ బలాబలాలు చూసుకుంటే అటు బౌలింగ్ తో పోల్చి చూస్తే బ్యాటింగ్లో ఎంతో పటిష్టంగా కనిపిస్తుంది ఇంగ్లీష్ జట్టు. ఎందుకంటే అటు ఓపెనర్లు జాస్ బట్లర్, ఫీల్ సాల్ట్ లు ప్రత్యర్ధులకు వణుకు పుట్టించే విధంగా బ్యాటింగ్ విధ్వంసాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా అటు ఇంగ్లాండ్ పై చేయి సాధించాలంటే ఓపెనర్లను ముందుగా ఔట్ చేస్తేనే బెటర్ అని ఎంతోమంది విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.



 ఇలా ఇంగ్లాండ్ ఓపెనర్ లను ఎంత త్వరగా ఔట్ చేస్తే ఇక భారత జట్టుకు అంత విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటూ చెబుతున్నారు. వీరితోపాటు మిడిల్ ఆర్డర్లో భారీ షాట్లతో విరుచుకుపడి మ్యాచ్ స్వరూపాన్ని ఏ క్షణంలోనైనా మార్చేసే హారీ బ్రూక్ కూడా టీమిండియాకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని.. ఇక ఇతనిపై కూడా టీమిండియా బౌలర్లు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అంటూ చెబుతున్నారు. కాగా ఇప్పటికే మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్, సౌత్ ఆఫ్రికా తలపడగా ఆఫ్ఘనిస్తాన్ ఫై గెలిచిన సౌత్ ఆఫ్రికా ఫైనల్ అడుగుపెట్టి చరిత్ర సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: