ఎన్నో రోజుల నుంచి ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరినీ కూడా అలరిస్తూ వచ్చిన టి20 ప్రపంచ కప్ టోర్ని ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఇక మరికొన్ని రోజుల్లో ఈ వరల్డ్ కప్ టోర్నీకి ముగింపు కార్డు పడబోతుంది. అందరూ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న  వరల్డ్ కప్ టైటిల్ విజేత ఎవరు అన్న విషయం తేలిపోబోతుంది. కాగా నేడు సెమి ఫైనల్ మ్యాచ్ ఎంత ఉత్కంఠ భరితంగా సాగుతోంది అన్న విషయం తెలిసిందే.


ఈ క్రమంలోనే నేడు ఇంగ్లాండ్ టీమ్ ఇండియా జట్ల మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది అని చెప్పాలి. అంతకుముందు ఉదయం జరిగిన మొదటి సెమి ఫైనల్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ సౌత్ ఆఫ్రికా జట్టు తలపడగా ఇక సౌత్ ఆఫ్రికా, ఆఫ్గనిస్తాన్ పై విజయం సాధించి ఫైనల్ లో అడుగుపెట్టింది. ఇక ఇప్పుడు రెండో సెమి ఫైనల్ మ్యాచ్లో విజేతగా నిలిచి ఫైనలిస్ట్ కాబోయే జట్టు ఏది అనే విషయం తెలుసుకునేందుకు అభిమానులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉండగా ..  ఇంగ్లాండ్ ఇండియా కెప్టెన్ల గురించి ఆసక్తికర విషయం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.


 ఏకంగా ఈ టి20 వరల్డ్ కప్ హిస్టరీలో ఇది ఒక యాదృచ్ఛిక ఘటన అని చెప్పాలి. ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంగ్లాండ్ కెప్టెన్ జాస్ బట్లర్ ఇప్పటివరకు ఆడిన ఇన్నింగ్స్ లు చేసిన రన్స్ మాత్రమే కాదు స్ట్రైక్ రేట్ కూడా ఒకేలా ఉండడం గమనార్హం. ఇప్పటివరకు రోహిత్ బట్లర్ ఈ వరల్డ్ కప్ లో ఆరు ఇన్నింగ్స్ లు ఆడాడు. ఇక ఇద్దరు కూడా వ్యక్తిగత ప్రదర్శనలో బ్యాటింగ్ లో 191 పరుగులు చేశారు. ఇక స్ట్రైక్ రేట్ ఇద్దరిదీ కూడా 159.16 ఉంది ఇలా అన్నీ కూడా ఒకేలా ఉన్నాయి అని చెప్పాలి  ఇక ఇది నిజంగా యాదృచ్ఛిక  అంటూ అభిమానులు అందరూ కూడా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: