టీమిండియాలో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ గురించి ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే దాదాపు దశాబ్దన్నర కాలం నుంచి టీమ్ ఇండియాలో కీలక ప్లేయర్గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ.. తన ఆట తీరుతో ప్రేక్షకులను అలరిస్తూనే వస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక మూడు ఫార్మాట్లలో కూడా భారత జట్టులో కీలక ప్లేయర్గా విరాట్ కోహ్లీ ప్రస్థానం కొనసాగిస్తున్నాడు. అయితే ఇక ఈ ఏడాది ముగిసిన ఐపీఎల్ లో కూడా విరాట్ కోహ్లీ మంచి ప్రదర్శన చేశాడు.


 దీంతో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ వెస్టిండీస్, యుఎస్ వేదికలుగా జరగబోయే టి20 వరల్డ్ కప్ లో కూడా అదరగొడతాడని భారత జట్టు విజయాలలో కీలక పాత్ర వహిస్తాడని అందరూ ఊహించరు. కానీ అందుకు భిన్నంగా విరాట్ కోహ్లీ మాత్రం తన ప్రదర్శనతో అందరికీ నిరాశే మిగులుస్తున్నాడు అని చెప్పాలి. ప్రతి మ్యాచ్ లోను చెత్త ప్రదర్శన చేసి నిరాశ పరుస్తున్నాడు. దీంతో విరాట్ కోహ్లీ ఓపెనర్ గా బరిలోకి దిగుతూ ఇక తక్కువ పరుగులకు వికెట్ కోల్పోతూ ఉండడంతో టీమిండియా మొదట్లోనే కష్టాల్లో పడిపోతుంది.


 ఈ క్రమంలోనే ఈ వరల్డ్ కప్ లో టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ వైఫల్యం పై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా పెదవి విరుస్తున్నారు. ఇప్పుడు వరకు ఏకంగా ఏడు మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లీ ఈ టోర్నమెంట్ లో కేవలం 75 పరుగులు మాత్రమే చేశారు. అయితే విరాట్ కోహ్లీ ఫామ్ ఫై ఎలాంటి ఆందోళన లేదని ఇప్పటికే కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా చెప్పారు. కానీ అతను వరుసగా తక్కువ పరుగులకే అవుట్ అవుతుండడం మాత్రం అభిమానులకు నిరాశను మిగులుస్తుంది. కనీసం సెమీఫైనల్ లో అయినా అదరగొడతాడు అనుకుంటే.. 9 పరుగులు చేసి చివరికి వికెట్ కోల్పోయాడు. ఇక ఇప్పటివరకు ఏడు మ్యాచ్లలో విరాట్ కోహ్లీ చేసిన పరుగులు చూసుకుంటే 1,4,0, 24, 37, 0, 9 పరుగులు మాత్రమే చేశాడు. అంటే కేవలం రెండు మ్యాచ్లలో మాత్రమే డబల్ డిజిట్ స్కోర్ ని అందుకున్నాడు. ఫైనల్ మ్యాచ్ ఒకటే మిగిలిందని.. అందులో అయినా రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: