సాధారణంగా జట్టుకు కెప్టెన్ గా ఉన్న వ్యక్తి ఎప్పుడు జట్టు విజయం కోసం పాటుపడుతూ ఉండాలి. ఇక అతనికి డిప్యూటీగా ఉన్న మరో ఆటగాడు ఇక కెప్టెన్  సలహాలు తీసుకోవడంలో ఎప్పుడు తోడ్పాటును అందిస్తూ ఉండాలి. అయితే ఇక జట్టు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఇద్దరు టీమ్ ను విజయతీరాలకు నడిపించాలి. అయితే ఇక ఇప్పుడు ఇలా కెప్టెన్ వైస్ కెప్టెన్ అనే పదాలకు సరైన అర్థం చెబుతున్నారు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాలు.


ప్రస్తుతం వెస్టిండీస్, యూఎస్ వేదికలుగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ టోర్నీ చివరి అంకానికి చేరుకుంది. ఈ క్రమంలోనే ఫైనల్ మ్యాచ్ తో ఇక ఈ వరల్డ్ కప్ ఎడిషన్ లో టైటిల్ విజేత ఎవరు అన్న విషయం తేలబోతుంది. కాగా ఇక ఈ వరల్డ్ కప్ టోర్నీలో అటు భారత జట్టు ఎంత అద్భుతమైన ప్రస్తానాన్ని కొనసాగిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అద్భుతంగా రాణిస్తూ అదరగొడుతుంది టీమ్ ఇండియా. ఒక్క ఓటమి కూడా లేకుండా ఫైనల్ వరకు దూసుకు వెళ్ళింది. ఇటీవల సెమీఫైనల్ లో అటు ఇంగ్లాండ్ ను ఓడించి ఫైనల్ లో అడుగుపెట్టింది అని చెప్పాలి. అయితే జట్టులోని పలువురు కీలక ఆటగాళ్లు విఫలమవుతున్న టీమ్ ఇండియా మాత్రం వరుస విజయాలు సాధిస్తుంది.


 అయితే భారత జట్టు ఇలా వరుస విజయాలు సాధించడంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాలు కీలక పాత్ర వహిస్తున్నారు. టోర్నీ ఆరంభం నుంచి ఆసాంతం ఇద్దరు కూడా జట్టును ముందుండి నడిపించారు. రోహిత్ శర్మ ఇప్పటివరకు ఏడు మ్యాచ్లు ఆడి 248 పరుగులు చేశాడు. టీమిండియా తరఫున అత్యధిక పరుగుల వీరుడుగా కొనసాగుతున్నాడు. మరోవైపు మిడిల్ ఆర్డర్లో బరిలోకి దిగే హార్దిక్ పాండ్యా 139 పరుగులతో పాటు 8 వికెట్లు తీసి జట్టు విజయాలలో కీలక పాత్ర వహిస్తున్నాడు. ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: