రోహిత్ శర్మ సారథ్యంలో ఐసిసి టోర్నీలలో టీమిండియా ఎంత విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీలో దాదాపు టైటిల్ గెలిచినంత పని చేసింది టీమిండియా. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఒక్క ఓటమి లేకుండా ఫైనల్ వరకు దూసుకు వెళ్లిన భారత జట్టు.. ఫైనల్ లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. దీంతో ఈ ఓటమితో కేవలం భారత క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు కూడా కాస్త నిరాశ చెందారు. విజేత కావడానికి అసలైన అర్హత కలిగిన జట్టు టీమ్ ఇండియా అని అంటూ సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టారు అని చెప్పాలి.


అయితే ఇక ఇప్పుడు జరుగుతున్న టి20 వరల్డ్ కప్ టోర్నీలో కూడా రోహిత్ శర్మ మరోసారి తన కెప్టెన్సీ తో అదరగొడుతున్నాడు. అయితే ఒకవైపు సారధ్య బాధ్యతలతో జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపిస్తూనే ఇంకోవైపు.. ఇక ప్రతి మ్యాచ్ లోను కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడుతూ జట్టు విజయాలలో కీలక పాత్ర వహిస్తూ ఉన్నాడు  అయితే ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్లో కూడా హాఫ్ సెంచరీ చేసి అదరగొట్టాడు రోహిత్ శర్మ  ఈ క్రమంలోనే రోహిత్ ఖాతాలో  ఓ అరుదైన రికార్డు వచ్చి చేరింది

 టి20 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్లలో హాఫ్ సెంచరీ చేసిన తొలి భారత కెప్టెన్ గా రోహిత్ శర్మ నిలిచాడు. ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్లో ఇక హాఫ్ సెంచరీ చేయడం ద్వారా రోహిత్ ఈ ఘనత సాధించాడు. అలాగే టి20 వరల్డ్ కప్ లో అత్యధిక ఫోర్లు బాదిన తొలి ప్లేయర్గా కూడా రోహిత్ అరుదైన రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు రోహిత్ శర్మ టి20 వరల్డ్ కప్ మ్యాచ్లో 113 ఫోర్లు కొట్టాడు  అయితే ఈ లిస్టులో రోహిత్ శర్మ తర్వాత మహేల జయవర్ధనే 111 ఫోన్లతో తర్వాత స్థానంలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: