టీమిండియాలో స్టార్ క్రికెటర్ గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయడం లేదు. ఎప్పుడో జట్టు విజయాల్లో కీలకపాత్ర వహించే కోహ్లీ.. ఇక ఇప్పుడు మాత్రం జట్టుకు భారంగానే మారిపోతున్నాడు. గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వన్ డే వరల్డ్ కప్ టోర్నీలో అందరూ విఫలమైన నేనున్నాను.. నేను గెలిపిస్తాను అనే భరోసాని అభిమానులందరికీ ఇచ్చిన విరాట్ కోహ్లీ.. ఎందుకో t20 వరల్డ్ కప్ లో మాత్రం ఇక చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయడం లేదు. ప్రతి మ్యాచ్ లోను భారీ అంచనాల మధ్య బరిలోకి దిగి ఇక స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక వికెట్ సమర్పించుకుంటున్నాడు.


 అయితే ఇప్పుడు వరకు ఈ వరల్డ్ కప్ ఎడిషన్ లో టీమిండియా తరఫున ఏకంగా ఏడు మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లీ కేవలం రెండుసార్లు మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ ని అందుకోగలిగాడు అని చెప్పాలి. దీన్నిబట్టి అతని ప్రదర్శన ఎంత దారుణంగా సాగుతూ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇటీవలే ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో అయినా విరాట్ కోహ్లీ బాగా రాణిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో తొమ్మిది పరుగులు చేసి చివరికి మరోసారి ప్రత్యర్ధుల వ్యూహాల ముందు వికెట్ సమర్పించుకున్నాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ ఆట తీరుపై కొంతమంది అభిమానులు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు అని చెప్పాలి.


 అయితే విరాట్ కోహ్లీ ఇలా వరుసగా విఫలమవుతున్నప్పటికీ.. కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం అతనికి మద్దతుగా నిలుస్తూనే ఉన్నాడు. ఇక ఇటీవల అటు సెమి ఫైనల్లో విఫలమైన తర్వాత కోహ్లీ గురించి కెప్టెన్ రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇక మరోసారి విరాట్ కి మద్దతు తెలిపాడు. విరాట్ కోహ్లీ క్వాలిటీ ప్లేయర్. 15 ఏళ్లుగా భారత జట్టు తరఫున ఆడుతున్నారు. ఫామ్ అనేది అతని సమస్యనే కాదు. పెద్ద మ్యాచ్ల్లో కోహ్లీ ఎంత ముఖ్యమో మాకు తెలుసు. అతని ఇంటెంట్ బాగుంది ఫైనల్ కోసం అతను రన్స్ సేవ్ చేసుకుంటున్నాడేమో అంటూ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కి మద్దతుగా నిలిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: