వెస్టిండీస్ యూఎస్ వేదికలుగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో భాగంగా భారత జట్టు ఎంత విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ లో ఎలా అయితే అదరగొట్టిందో.. జైత్ర యాత్రను కొనసాగిస్తూ ఒక్క ఓటమి లేకుండా ఫైనల్ వరకు వెళ్ళిందో.. ఇక ఇప్పుడు టి20 వరల్డ్ కప్ లో కూడా అదే రీతిలో ప్రస్తానాన్ని కొనసాగిస్తుంది. అమెరికాలోని స్లో పిచ్ లపై అన్ని అగ్రశ్రేణి టీమ్స్ తడబడితే టీమిండియా మాత్రం అటు ప్రత్యర్థులపై పూర్తిస్థాయి పైచేయి సాధించింది.


 అయితే ఇప్పటికే సూపర్ 8 దశలో మూడు మ్యాచ్ లలో గెలిచి సెమి ఫైనల్ లో అడుగుపెట్టిన టీమిండియా ఇటీవల అటు ఇంగ్లాండ్ జట్టుతో సెమి ఫైనల్ మ్యాచ్లో తలబడింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లోను విజయ డంకా మోగించింది. ఈ క్రమంలోనే ఫైనల్ లో అడుగు పెట్టింది. రేపు జరగబోయే ఫైనల్ లో సౌత్ ఆఫ్రికా జట్టుతో మ్యాచ్ ఆడబోతుంది. కాగా ఈ ఫైనల్ మ్యాచ్ సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కాబోతుంది అని చెప్పాలి. కాగా ఇంగ్లాండ్ పై విజయం సాధించడం ద్వారా ఏకంగా గతంలోని ఒక సెమి ఫైనల్ ఓటమికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది అన్న విషయం తెలిసిందే.


 సరిగ్గా రెండేళ్ల క్రిందట ఇంగ్లాండ్ జట్టు టీమ్ ఇండియా ఘోర పరాభవానికి కారణమైంది . దీంతో ఇక ఇప్పుడు అదే సెమి ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు ఇంగ్లాండ్ పై రివెంజ్ తీర్చుకుంది. 2022 t20 వరల్డ్ కప్ లో సెమి ఫైనల్లో ఇంగ్లాండ్ జట్టు ఏకంగా 10 వికెట్ల తేడాతో భారత జట్టును చిత్తుగా ఓడించేసింది. దీంతో టీమిండియా అవమానకర రీతిలో వరల్డ్ కప్ టోర్నీ నుంచి నిష్క్రమించే పరిస్థితి వచ్చింది అని చెప్పాలి. దీంతో అప్పట్లో భారత జట్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి. అప్పటి అవమానానికి ఇక ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంది టీం ఇండియా. ఏకంగా 69 పరుగులు తేడాతో విజయం సాధించి ఇంగ్లాండును ఇంటికి పంపించింది. ఇక ఈ విజయంతో భారత అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: