2024 t20 వరల్డ్ కప్ టోర్నమెంట్లో అద్భుతమైన ప్రయాణాన్ని కొనసాగిస్తూ వచ్చిన టీమిండియా నేడు తుది పోరుకుచేరుకుంది. ఇక ఫైనల్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాను ఢీకొట్టేందుకు రెడీ అవుతుంది అన్న విషయం తెలిసిందే. రోహిత్ కెప్టెన్సీ లో ఓటమి ఎరుగని జట్టుగా జైత్రయాత్రను కొనసాగిస్తూ దూసుకు వచ్చిన టీమిండియా ఇక ఇప్పుడు ఫైనల్ లో కూడా గెలిచి కప్పు ఎగరేసుకుపోవాలని పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే పక్కా ప్రణాళికలతో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే నేడు జరగబోయే ఫైనల్ మ్యాచ్లో విజేత ఎవరు అనే విషయంపై క్రికెట్ ప్రపంచం మొత్తం ఉత్కంఠ నెలకొంది.


 ఇదే విషయం గురించి ఎంతోమంది మాజీ ఆటగాళ్ళు కూడా స్పందిస్తూ తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో చెప్పేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇక హిస్టరీలోనే మొదటిసారి ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్లో అడుగుపెట్టిన ప్రోటీస్ జట్టు ఎట్టి పరిస్థితుల్లో కప్పు గెలవాలి అనే పట్టుదలతో ఉంది. ఇక మరోవైపు ప్రొటీస్ జట్టు కూడా ఓటమి ఎరుగని జట్టుగా ఫైనల్ వరకు దూసుకు వచ్చింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ రెండు టీమ్స్ నిండా స్టార్ క్రికెటర్స్ ఉండడం.. ఏ క్షణంలోనైనా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసే యోధులు ఉండడంతో మ్యాచ్ నువ్వా నేనా అన్నట్లుగా ఉత్కంఠ భరితంగా సాగడం ఖాయమని ఎంతోమంది క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


 టీమిండియా ఓపెనర్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా బ్యాటింగ్ లో అదరగొడుతున్నాడు. కానీ మరో ఓపెనర్ విరాట్ కోహ్లీ మాత్రం ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఈ వరల్డ్ కప్ లో ఇప్పటివరకు అతను చేసింది 75 పరుగులు మాత్రమే. దీంతో ఎంతో మంది విరాట్ ను ఓపెనర్ గా తప్పించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయంపై పాకిస్తాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ రియాక్ట్  అయ్యాడు. మెగా టోర్నీలో భారత్ ఆడుతున్న తీరును మెచ్చుకున్నాడు. అయితే టీమిండియా కప్పు కొట్టాలంటే మాత్రం ఫైనల్ మ్యాచ్ ఓపెనింగ్ స్లాట్ విషయంలో ఒక మార్పు చేయాలి అంటే చెప్పుకొచ్చాడు. స్టార్ హిట్టర్ అయినా రిషబ్ పంతును ఓపెనర్ గా ఆడించాలని సూచించాడు. అలా దించితే ఇక టీమిండియాకు తిరుగు ఉండదు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇక కోహ్లీ తనకు అలవాటైన మూడో నెంబర్లో బ్యాటింగ్ చేయడానికి అవకాశం ఉంటుందని తెలిపాడు.. అలా చేస్తే ఎంతో సులభంగా టీమిండియా కప్పు కొట్టక్కర్లేదు అంటూ అభిప్రాయపడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: