2011 తర్వాత అందరి ద్రాక్షలా మారిన ఒక కలను నెరవేర్చుకునేందుకు ప్రస్తుతం టీమిండియా సిద్ధమైంది. ప్రస్తుతం వెస్టిండీస్, యూఎస్ వేదికలుగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ 2024 ఎడిషన్ లో అనుకున్న విధంగా రాణించి  ఫైనల్ వరకు చేరుకుంది టీం ఇండియా. ఒక్క ఓటమి లేకుండా జైత్రయాత్రను కొనసాగించి అదరగొట్టేసింది అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఫైనల్ లో సౌత్ ఆఫ్రికాతో తలబడేందుకు సిద్ధమైంది.


 ఇలా ఫైనల్లో సౌత్ ఆఫ్రికా ను ఓడించి ఇక కప్పు గెలవాలి అనే కలను నిజం చేసుకునేందుకు రెడీ అయింది. ప్రస్తుతం టీమిండియా దూకుడు చూస్తుంటే తప్పకుండా అటు వరల్డ్ కప్ టైటిల్ గెలవడం ఖాయమని అభిమానులు అందరూ కూడా నమ్ముతున్నారు. అయితే అటు సౌత్ ఆఫ్రికా ఇటు టీమ్ ఇండియాను సింగిల్ హ్యాండ్ తో మ్యాచ్ ను తమ వైపుకు తిప్పుకోగల యోధులు ఉన్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో తుది పోరు ఎంతో ఉత్కంఠ భరితంగా సాగడం ఖాయమని నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ సెమీఫైనల్ లో లాగానే ఫైనల్లో కూడా అదరగొడతాడని ఇక అతనే మ్యాచ్ విన్నర్ అంటూ అందరూ అనుకుంటున్నారు.


 ఇలాంటి సమయంలో భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ మాత్రం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఫైనల్ పోరులో టీమిండియాను రోహిత్ కాదు విరాట్ కోహ్లీ గెలిపిస్తాడు అంటూ వ్యాఖ్యానించాడు.  అతని ఫామ్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అతడు రాజులకే రాజు   ఫైనల్ మ్యాచ్లో అతను తన బెస్ట్ ఇస్తాడు అంటూ కృష్ణమాచారి శ్రీకాంత్ వాక్యానించాడు. కానీ వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ పెద్దగా రాణించడం లేదు. ఏడు మ్యాచ్లలో కలిపి 75 పరుగులు మాత్రమే చేశాడు. మొన్న సెమీఫైనల్ మ్యాచ్లో కూడా కేవలం 9 పరుగులు మాత్రమే చేసి వికెట్ సమర్పించుకున్నాడు. మరి ఫైనల్లో ఎలా రానిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: