నిన్న ఐసీసీ మెన్స్ టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. మొదటి నుండి ఈ మ్యాచ్ కి వర్షం అంతరాయం కలిగిస్తుంది అని అంతా అనుకున్నారు. కానీ అలాంటి పరిస్థితులు ఏమీ జరగలేదు. మ్యాచ్ అంతా సజావుగా సాగింది. ఇక మొదటగా టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. అందులో భాగంగా భారత జట్టు మొదట వికెట్లు కోల్పోవడంతో కాస్త తడబడిన చివరగా 177 పరుగులు చేసింది. దానితో 178 పరుగుల లక్ష్యంతో సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ లోకి దిగింది. ఇక వీరి ఇన్నింగ్స్ మొదలు అయినా చాలా తక్కువ ఓవర్లలోనే వీరు వరుసగా వికెట్లను కోల్పోయారు. దానితో మ్యాచ్ ఇండియా వైపు తిరిగింది.

కానీ ఆ తర్వాత క్లాసెన్ ఆటలోకి దిగాడు. ఇక ఇతను ఒకటి , రెండు బాళ్లను డాట్ చేసినా కానీ ఆ తర్వాత సిక్స్ లు , ఫోర్ లతో వాటిని సమం చేసుకొని ఒకానొక దశలో అతను ఆడిన బాల్స్ కంటే డబల్ డిజిట్ స్కోర్ ను చేశాడు. ఇక 14 ఓవర్లో మ్యాచ్ మొత్తం సౌత్ ఆఫ్రికా వైపు వెళ్లింది. అక్షర్ పటేల్ వేసిన ఈ ఓవర్లలో ఏకంగా 24 పరుగులు వచ్చాయి. దానితో ఇండియా ఈ మ్యాచ్ ఓడిపోయింది అని అంతా అనుకున్నారు. ఇక ఆ తర్వాత నుండి అసలు కథ ప్రారంభం అయింది.

16 ఓవర్ ను హార్దిక్ పాండ్యా వేశాడు. ఇందులో క్లాసెస్ వికెట్ తీశాడు. అలాగే ఆ ఓవర్లో చాలా తక్కువ పరుగులు ఇచ్చాడు. ఇక ఆ తర్వాత రోహిత్ విహాత్మకంగా భుమ్రా తో 17 వ ఓవర్ వేయించాడు. అతను కూడా అత్యంత తక్కువ రన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత అర్షదీప్ ఓవర్ వేశాడు. అతను కూడా చాలా తక్కువ పరుగులు ఇచ్చాడు. ఇక 19వ ఓవర్ భూమ్రా వేసి చాలా తక్కువ పరుగులు ఇచ్చాడు. ఇక చివరగా 20 ఓవర్ హార్దిక్ పాండ్యా వేశాడు. ఈ ఓవర్ కూడా చాలా తక్కువ పరుగులు రావడంతో ఇండియా అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: