మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో 2007లో టీమిండియా t20 వరల్డ్ కప్పు విన్నైన సంగతి తెలిసిందే. మళ్లీ ఆ కప్పును ముద్దాడటానికి టీమ్ ఇండియాకు 17 ఏళ్ల సమయం పట్టింది. ఈసారి ఈ విన్నింగ్ టీమ్‌కు కెప్టెన్ గా రోహిత్ శర్మ వ్యవహరించాడు. సౌతాఫ్రికా టీమ్‌తో జరిగిన ఉత్కంఠభరిత 2024 ఐసీసీ t20 ఫైనల్స్‌లో భారత్ నేడు వికెట్ల తేడాతో విజయం సాధించింది దాంతో కప్ సొంతం చేస్తుంది.

 ఈ రెండు కప్పుల కంటే ముందు కపిల్ దేవ్‌ 1983 ODI ప్రపంచ కప్ గెలిచారు. మొదటి వరల్డ్ కప్ సాధించిన క్రికెట్ హీరోగా కపిల్ దేవ్ పేరు ఇప్పటికీ మార్మోగుతుంది. ఆ తర్వాత ధోనీ పేరు వినిపించింది ఇకనుంచి రోహిత్ శర్మ పేరు వినిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతడి సారధ్యంలోనే ఇండియా అత్యంత ప్రతిష్టాత్మకమైన టీ20 వరల్డ్ కప్ గెలుచుకుంది. ధోనీ టి20 వరల్డ్ కప్ తో పాటు వన్డే వరల్డ్ కప్ కూడా సాధించి పెట్టాడు రెండు వరల్డ్ కప్ సాధించిన ఏకైక కెప్టెన్ గా ధోని రికార్డు సృష్టించాడు.


  ఆ తర్వాత భారత జట్టుకు చాలామంది కెప్టెన్సీగా మారుతూ వచ్చారు. కోహ్లీ కొన్ని ఏళ్లపాటు భారత్ ను లీడ్ చేశాడు. కానీ వరల్డ్ కప్ గెలిచే దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాడు. చివరికి అయితే శర్మకు అన్ని ఫార్మాట్లలో నాయకత్వ బాధ్యతలు లభించాయి. సద్వినియోగం చేసుకుంటూ టీం విజయ్ తీరాల వైపు నడిపించారు. ఎంతో కష్టపడి ఎన్నో స్ట్రాటజీస్ ప్లాన్ చేసి చివరికి అద్భుత విజయాన్ని భారతీయులందరికీ సాధించి పెట్టారు. ధోనీ తర్వాత భారత్ త్‌ టి20 కప్ తెచ్చి పెట్టిన ఏకైక కెప్టెన్ గా నిలిచాడు. ఈ ఫైనల్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 76, అక్షర్ పటేల్ 47 పరుగులు చేశారు. హార్దిక్ పాండ్య 20 రన్స్ ఇచ్చి మూడు కీలకమైన వికెట్లు పడగొట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: