భారత క్రికెట్ జట్టులో అత్యంత కీలక ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒకరు. ఈయన ఇండియన్ క్రికెట్ జట్టులోకి అత్యంత చిన్న వయసు ఉన్న సమయంలోనే ఎంట్రీ ఇచ్చాడు. ఇక చిన్న వయసు ఉన్న సమయం లోనే ఈయన అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించడం మొదలు పెట్టాడు. దానితో అతి తక్కువ కాలంలోనే కోహ్లీ తన ఆట తీరుతో కేవలం భారత దేశ అభిమానులను మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడా అభిమానుల మనసును దోచుకోవడం మొదలు పెట్టాడు. కోహ్లీ తన అద్భుతమైన ఆట తీరుతో ఎన్నో సెంచరీలను సాధించాడు.

ఇకపోతే కొంత కాలం పాటు విరాట్ కోహ్లీ భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు. కానీ ఈయన కెప్టెన్సీ వహించిన సమయంలో భారత జట్టుకు పెద్ద ట్రోఫీలు ఏమీ దక్కలేదు. దానితో ఈయనే స్వచ్ఛందంగా కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకున్నారు. ఇకపోతే నిన్న భారత్ మరియు సౌత్ ఆఫ్రికా ల మధ్య "ఐ సీ సీ టి 20 మెన్స్ వరల్డ్ కప్ 2024" లో ఫైనల్ మ్యాచ్ జరిగిన విషయం మనకు తెలిసిందే. ఈ మ్యాచ్ ఎంతో ఉత్కంఠ గా ముందుకు సాగింది. ఈ ఉత్కంఠ పౌరుల చివరగా భారత్ అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఈ మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ నేను ఇకపై టీ 20 మ్యాచ్ లు ఆడను. ఇదే నా చివరి టీ 20 మ్యాచ్. కొత్తతరం ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం కోసం నేను టీ 20 మ్యాచ్ ల నుండి తప్పుకుంటున్నాను అని ప్రకటించాడు. ఇక నిన్నటితో విరాట్ కోహ్లీ టీ 20 మ్యాచ్ ల నుండి రిటైర్మెంట్ తీసుకున్నట్లు ప్రకటించాడు. ఇక దీనితో అందరి చూపు విరాట్ కోహ్లీ లాంటి గొప్ప ఆటగాడి ప్లేస్ ను భర్తీ చేసే లక్షణాలు ఎవరికి ఉన్నాయా అనే దానిపై పడింది. విరాట్ కోహ్లీ నిన్నటి మ్యాచ్ లో కూడా జట్టు వరుసగా వికెట్లను కోల్పోతుంటే కాస్త స్లో గా అడిన సరే వికెట్లు పడకుండా రన్ రేట్ ను కాపాడుతూ వచ్చాడు. ఇక చివరకు ఈయన కొట్టిన స్కోర్ ఇండియా జట్టు గెలవడానికి అత్యంత ఉపయోగపడింది. ఇలా కీలక మ్యాచ్ లో సైతం ఎంతో కూల్ గా ఆడే ఆ లక్షణాలు ఎవరికి ఉన్నాయా అని భారత క్రికెట్ అభిమానులు అంతా సమీకరణాలు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: