భారత క్రికెట్ హిస్టరీలో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ లలో ఒకడిగా మారిపోయాడు రోహిత్ శర్మ. అతను కెప్టెన్సీ చేపట్టిన నాటి నుంచి కూడా భారత జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపించడంలో సక్సెస్ అయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అద్భుతమైన ప్రదర్శన చేసి జట్టును విజయతీరాల్లోకి నడిపించాడు. ఈ క్రమంలోనే ఇక భారత క్రికెట్ హిస్టరీలో టి20 ఫార్మాట్లో అత్యధిక సక్సెస్ రేట్స్ సాధించిన కెప్టెన్ గా కూడా అటు రోహిత్ రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. అదే సమయంలో ఇటీవల భారత క్రికెట్ ప్రేక్షకులందరికీ కలను నెరవేర్చాడు.


 ఇటీవల వెస్టిండీస్, యూఎస్ వేదికగా జరిగిన టి20 లో అటు భారత జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపించాడు. ఒక్క ఓటమి కూడా లేకుండా టీమిండియా ఏకంగా ఫైనల్ వరకు దూసుకు వెళ్లింది. ఫైనల్ పోరులో సౌత్ ఆఫ్రికాను ఓడించి వరల్డ్ కప్ టైటిల్ విజేతగా నిలిచింది అని చెప్పాలి. దీంతో 140 కోట్ల భారత క్రికెట్ ప్రేక్షకుల కల సహకారం అయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలోనే ఈ వరల్డ్ కప్ గెలిచిన వెంటనే తన రిటైర్మెంట్కు ఇంతకంటే మంచి సమయం లేదు అని కొన్ని భావించిన రోహిత్ శర్మ అంతర్జాతీయ టి20 లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. యువకులకు ఛాన్స్ ఇవ్వడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు.


 అయితే ఇలా టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ వరల్డ్ కప్ టైటిల్ గెలిచిన కెప్టెన్ గా మారిన నేపథ్యంలో అతని గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు వైరల్ గా మారిపోతున్నాయ్. రోహిత్ శర్మ టి20 ఫార్మాట్లో ఫైనల్ కు వెళ్లిన   ప్రతిసారి కూడా విజయం సాధించారు. భారత కెప్టెన్గా 2024 వరల్డ్ కప్ సాధించిన రోహిత్ శర్మ.. 2018 నిదాహాస్ ట్రోఫీలో ఫైనల్లో విజయం సాధించారు. ఇక ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ సారధిగా 2013, 2015, 2017, 2019, 2020లో ముంబై ఇండియన్స్ ను ఫైనల్ చేర్పించడమే కాదు విజయాన్ని కూడా అందుకున్నారు   ఇక అంతే కాకుండా 2013 సిఎల్టి20 ఫైనల్లో కూడా విజయం సాధించారు. దీంతో టి20 ఫార్మాట్ లో ఆయన ఒక లెజెండరీ కెప్టెన్ గా మారిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: