టీమిండియాకు 17 ఏళ్ల కల సహకారమైంది. ఎన్నో ఏళ్లుగా ప్రపంచ కప్ టోర్నీలో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నప్పటికీ.. టైటిల్ గెలవడంలో మాత్రం విఫలం అయిపోతున్న టీమిండియా.. ఇక వెస్టిండీస్, యూఎస్ వేదికగా జరిగిన ప్రపంచకప్ టోర్నీలో మాత్రం పట్టు విడువని విక్రమార్కుడిలా పోరాడింది. అద్భుతమైన ప్రదర్శన చేసి ఆకట్టుకుంది. మొదటి మ్యాచ్ నుంచి కూడా జైత్రయాత్రను మొదలుపెట్టిన టీమిండియా.. ఒక్క ఓటమి కూడా లేకుండా ఫైనల్ వరకు దూసుకు వెళ్ళింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే అద్భుతమైన ప్రదర్శన చేసి ఆకట్టుకుంది టీం ఇండియా. ఇక అన్ని టీమ్స్ అమెరికాలోని స్లో పిచ్ లపై బాగా రాణించడానికి తడబడుతూ ఉంటే అటు టీమిండియా  మాత్రం అదరగొట్టేస్తుంది.



 అయితే గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీలో కూడా ఇలాంటి ప్రదర్శన చేసినప్పటికీ ఫైనల్లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి నిరాశపరిచింది. కానీ ఇప్పుడు ఎలాంటి తప్పిదాలు చేయకుండా ఫైనల్ వరకు దూసుకు వెళ్లిన టీమిండియా.. ఫైనల్ లో సౌత్ ఆఫ్రికాను సైతం ఓడించి ఇక టైటిల్ విజేతగా నిలిచి విశ్వ విజేతగా అవతరించింది. నాలుగోసారి ఐసీసీ టైటిల్ అందుకుంది అని చెప్పాలి. అయితే ఇలా వరల్డ్ కప్ గెలిచిన సమయంలో మైదానంలో ఎంత ఎమోషనల్ దృశ్యాలు కనిపించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


 మరి ముఖ్యంగా టీమ్ ఇండియాను గెలిపించడంలో కీలకపాత్ర వహించిన స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఇక వరల్డ్ కప్ గెలిచిన వెంటనే కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే ఇంతలా ఎమోషనల్ అవ్వడానికి కారణం ఏంటి అన్న విషయాన్ని చెప్పుకొచ్చారు హార్థిక్ పాండ్యా. ఈ టి20 వరల్డ్ కప్ తనకి ఎంతో ప్రత్యేకం అంటూ తెలిపారు. వ్యక్తిగతంగా నా గురించి ఒక్క శాతం కూడా తెలియని వారు ఏదేదో మాట్లాడారు. నా జీవితం గత ఆరు నెలలుగా ఎలా ఉందో మీకు తెలుసు. నేను ఒక్క మాట కూడా మాట్లాడకపోయినా.. ఎంతో ట్రోలింగ్ కూడా చేశారు. వాటిపై మాట్లాడాలనుకోలేదు. పరిస్థితులే వాటికి సమాధానం చెబుతాయి అని భావించాను అంటూ హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: