వరల్డ్ క్రికెట్లో టి20 ఫార్మాట్లో భారత జట్టు పటిష్టమైన జట్లలో ఒకటిగా కొనసాగుతుంది. కానీ అలాంటి భారత జట్టుకు వరల్డ్ కప్ టైటిల్ గెలవడం అనేది కేవలం కలగానే మిగిలిపోయింది. అప్పుడప్పుడు t20 ఫార్మాట్ ప్రవేశపెట్టినప్పుడు జరిగిన మొదటి ప్రపంచ కప్ టోర్నీలో 2007లో వరల్డ్ కప్ టైటిల్ గెలుచుకుంది. ధోని కెప్టెన్సీలో ఈ రికార్డు సాధించింది. కానీ అప్పటినుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా t20 ఫార్మాట్లో వరల్డ్ కప్ గెలవలేకపోయింది టీమిండియా. దాదాపు 17 ఏళ్లుగా ఈ ఫార్మాట్లో ఐసీసీ ట్రోఫీ గెలుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది.


 అయితే 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఇటీవలే టీమిండియా వరల్డ్ కప్ టైటిల్ ను ముద్దాడింది. ధోని తర్వాత ఎంతో మంది కెప్టెన్లు మారగా ఇక రోహిత్ కెప్టెన్సీ లో వరల్డ్ కప్ టైటిల్ కల సహకారమైంది అని చెప్పాలి. వెస్టిండీస్, యూఎస్ వేదికగా జరిగిన ఇటువంటి వరల్డ్ కప్ టోర్నమెంట్ లో టీమిండియా ఒక్క పరాజయం లేకుండా ఫైనల్ వరకు దూసుకు వెళ్ళింది. ఇక ఫైనల్లో నువ్వా నేనా అన్నట్లుగా జరిగిన పోరులో సౌత్ ఆఫ్రికా జట్టును ఏడు పరుగులు తేడాతో ఓడించి ఇక విశ్వవిజేతగా అవతరించింది టీమిండియా. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ గెలిచిన టీం ఇండియా పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.


 కాగా ఇలా టీమ్ ఇండియాకు వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ గా రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ.. ఎన్నో అరుదైన రికార్డులను కూడా ఖాతాలో వేసుకున్నాడు. టి20 వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్ గా కూడా రోహిత్ రికార్డు సృష్టించాడు. ఇటీవలే ముగిసిన వరల్డ్ కప్ లో 257 పరుగులు చేసి ట్రోఫీని గెలవడంలో కెప్టెన్ గా మాత్రమే ఆటగాడిగాను కీలక పాత్ర పోషించాడు. భారత కెప్టెన్ గా ఇది అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. ఇక 2007లో ధోని 154, 2009లో 86, 2010లో 85, 2012లో 64, 2014లో 50, 2016లో 69, పరుగులు చేశారు  2021 లో అప్పటి విరాట్ కోహ్లీ 68 పరుగులు చేయగా.. 2022లో రోహిత్ శర్మ 161 చేశాడు. ఈ వరల్డ్ కప్ లో 257 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు రోహిత్.

మరింత సమాచారం తెలుసుకోండి: