ఎన్నో రోజులపాటు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరినీ కూడా అలరిస్తూ వచ్చిన టి20 వరల్డ్ కప్ 2024 ఎడిషన్ ముగిసింది. నువ్వా నేనా అన్నట్లుగా ఉత్కంఠ భరితంగా సాగిన పోరు ప్రేక్షకులందరికీ కూడా టీవీలకు అతుక్కుపోయేలా చేసింది. అయితే భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన కొన్ని టీమ్స్ అభిమానులను నిరాశపరిస్తే మరికొన్ని టీమ్స్ మాత్రం అంచనాలకు మించి రాణించాయి. అద్భుతమైన ప్రదర్శన చేసి ఇక వరల్డ్ కప్ లో ప్రస్తానాన్ని కొనసాగించాయ్. ఇక ఫైనల్లో సౌత్ ఆఫ్రికా టీమిండియా మధ్య జరిగిన పోరు అయితే ఉత్కంఠతో ప్రేక్షకులందరికీ కూడా మునివేళ్ళపై నిలబెట్టగలిగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.


 అయితే ఇలా టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించిన టీమ్ ఇండియా విశ్వవిజేతగా అవతరించింది. దాదాపు 17 ఏళ్ల తర్వాత టి20 ఫార్మాట్లో టైటిల్ గెలుచుకోగలిగింది టీం ఇండియా. ఈ క్రమంలోనే భారత జట్టు ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి. కాగా ఈ వరల్డ్ కప్ ముగిసి రోజులు గడుస్తున్న.. ఇంకా ఈ ప్రపంచకప్ టోర్నికి సంబంధించిన చర్చ మాత్రం ఆగడం లేదు. అయితే వరల్డ్ కప్ జరిగిన ప్రతిసారి కూడా ఈ టోర్నీ ముగిసిన వెంటనే.. ఇక ప్రపంచకప్ మొత్తం మంచి ప్రదర్శన చేసిన ఆటగాళ్లతో ఐసిసి ఒక టి20 వరల్డ్ కప్ టీం ని ప్రకటిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.


 ఇక ఇటీవల టీ20 వరల్డ్ కప్ 2024 ఎడిషన్ ముగిసిన నేపథ్యంలో టీమిండియా ఇదే రీతిలో ఇక ఐసీసీ టీం ను ప్రకటించింది . జట్టులో ఇక టీమిండియా కెప్టెన్  రోహిత్ శర్మ టాప్ లో ఉన్నాడు  257 పరుగులతో ఈ జట్టులో చోటు సంపాదించుకున్నాడు. అంతేకాకుండా భారత జట్టు నుంచి ఏకంగా ఆరుగురు ఆటగాళ్లు జట్టులో చోటు దక్కించుకోవడం గమనార్హం.  ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ గుర్బాజ్ వెస్టిండీస్ ప్లేయర్ పూరన్, ఇండియా ప్లేయర్ సూర్య, ఆస్ట్రేలియా ప్లేయర్స్ స్టోయినిస్, ఇండియా ప్లేయర్ హార్దిక్ పాండ్యా, ఇండియా నుంచి అక్షర పటేల్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి రషీద్ ఖాన్, ఇండియా నుంచి బుమ్రా, హర్షదీప్.. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఫరూకి, సౌత్ ఆఫ్రికా నుంచి నోకియా వరల్డ్ కప్ లో ఐసీసీ బెస్ట్ టీం లో చోటు సంపాదించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: