ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరికీ కూడా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పంచిన వరల్డ్ కప్ టోర్నీ ముగిసింది  వెస్టిండీస్ యుఎస్ వేదికలుగా జరిగిన టి20 వరల్డ్ కప్ టోర్నీ మొదటి మ్యాచ్ నుంచి ఎంతో ఆసక్తికరంగా సాగింది అన్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఎంతోమంది క్రికెట్ ప్రేక్షకుల అంచనాలను కూడా తారుమారు చేసింది   ఎందుకంటే భారీ అంచనాల మధ్య వరల్డ్ కప్ లో బరిలోకి దిగిన కొన్ని టీమ్స్ చెత్త ప్రదర్శన చేస్తే.. ఎలాంటి అంచనాలు లేకుండా వరల్డ్ కప్ ప్రస్తానాన్ని మొదలుపెట్టిన చిన్న టీమ్స్ మాత్రం అదరగొట్టేసాయి. అయితే ఇక ఈ వరల్డ్ కప్ లో అటు ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించిన టీమిండియా వరల్డ్ కప్ కలను సహకారం చేసుకుంది అని చెప్పాలి.


 ఫైనల్ మ్యాచ్ అంటే చాలు మినిమం ఉత్కంఠ ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ప్రేక్షకులు. అయితే ప్రేక్షకులు ఊహించిన దానికంటే మొన్నటికి మొన్న ముగిసిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఉత్కంఠ మరో రేంజ్ లో ప్రేక్షకులను అలరించింది. చివరి బంతి వరకు కూడా ఎవరు విజేతగా నిలుస్తారు అనే విషయంపై సస్పెన్స్ నెలకొంది. ఒక రకంగా ప్రేక్షకులందరికీ కూడా ఉత్కంఠతో మునివేళ్ళపై నిలబెట్టింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. నువ్వా నేనా అన్నట్లుగా ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్ పోరులో ఏడు పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించి టైటిల్ విజేతగా అవతరించింది.


 అయితే సాధారణ లీగ్ మ్యాచ్ లను మిస్ చేసుకోవడానికి అయినా కొంతమంది ప్రేక్షకులు ఇష్టపడతారు. కానీ అటు ఫైనల్ మ్యాచ్ మాత్రం తప్పకుండా చూడాలని అనుకుంటారు. దీంతో వ్యూయర్షిప్ లో కూడా రికార్డులు క్రియేట్ అవుతూ ఉంటాయి. అయితే ఇక మొన్నటికి మొన్న ముగిసిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో వ్యూయర్ షిప్ ఎంత వచ్చింది అనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే ఓటిటి ప్లాట్ ఫామ్ హాట్స్టార్ లో 5.3 కోట్ల మంది ఈ వ్యూయర్షిప్ ని వీక్షించినట్లు తెలుస్తోంది. కాగా గత ఏడాది ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ను రికార్డు స్థాయిలో 5.9 కోట్ల మంది వీక్షించారు. మరోవైపు ఈ టి 20 ఫైనల్ మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేసింది . ఇలా వ్యూయర్షిప్ లో 5.3 కోట్ల మంది వీక్షించడంతో వన్డే ప్రపంచ కప్ రికార్డు అలాగే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc