టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల భారత్ జట్టు కలను నెరవేర్చారు. దాదాపు 17 ఏళ్ల తర్వాత ఇక వరల్డ్ కప్ ను అందించారు. కెప్టెన్ గా సూపర్ సక్సెస్ అయ్యాడు. భారత జట్టు సారథ్యా బాధ్యతలు చేపట్టిన నాటకం నుంచి కూడా టీంని ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నారు. గత ఏదాది వన్డే వరల్డ్ కప్ ట్రోఫీలో ఒక్క ఓటమి లేకుండా టీమిండియాలో ఫైనల్ వరకు తీసుకోవడంలో సక్సెస్ అయిన రోహిత్ శర్మ.. 2024 t20 వరల్డ్ కప్ ఎడిషన్ లో కూడా ఇదే రీతిలో అద్భుతంగా రాణించారు.


 అయితే కేవలం కెప్టెన్ గా మాత్రమే కాకుండా అటు ఆటగాడిగా కూడా సూపర్ సక్సెస్ అయ్యాడు రోహిత్ శర్మ. ఒకవైపు జట్టు విజయాలకు కీలక పాత్ర వహిస్తూనే ఇంకోవైపు జట్టును ఒక్క తాటిపై నడిపించడంలో విజయం సాధించారు  ఈ క్రమంలోనే రోహిత్ శర్మ కెప్టెన్సీ పై ప్రస్తుతం అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు అని చెప్పాలి. ఇటీవల icc ప్రకటించిన టి20 వరల్డ్ కప్ బెస్ట్ టీం లో కూడా రోహిత్ శర్మకు అవకాశం దొరికింది అన్న విషయం తెలిసిందే. అయితే భారత జట్టు టైటిల్ గెలవడంతో అభిమానులందరూ కూడా సంతోషంగా మునిగిపోయారు. ఇలాంటి సమయంలో టీమిండియా ఫ్యాన్స్ icc ని ఒక కొత్త విషయంపై డిమాండ్ చేస్తున్నారు.


 టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఐసిసి క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డును ఇవ్వాల్సిందే అంటూ రోహిత్ శర్మ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. 2024 లో ఇప్పటివరకు రోహిత్ సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటున్నారు ఫ్యాన్స్. టి20 వరల్డ్ కప్ సాధించిన కెప్టెన్గా రికార్డ్స్ సృష్టించడంతోపాటు.. ఇక ఈ వరల్డ్ కప్ లో అత్యధిక స్కోరర్ గా కూడా రోహిత్ శర్మ కొనసాగారు. ఇంత అద్భుతమైన ప్రదర్శన చేసిన రోహిత్ శర్మకు అటు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కాల్సిందే అంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలి అంటూ కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: