వెస్టిండీస్, యూఎస్ వేదికలుగా జరిగిన టి20 వరల్డ్ కప్ 2024 ఎడిషన్ లో భారత జట్టు ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించింది అన్న విషయం తెలిసిందే. ప్రతిసారి కూడా వరల్డ్ కప్ టోర్నీలో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నప్పటికీ ఇక సరైన రీతిలో అదృష్టం కలిసి రాలేదు. దీంతో చివరి అడుగులో చివరికి వరల్డ్ కప్ టైటిల్ అందుకోవడంలో విఫలమవుతూనే వచ్చింది టీం ఇండియా. కానీ ఈసారి మాత్రం అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంది అన్న విషయం తెలిసిందే.


 మొదటి మ్యాచ్ నుంచి కూడా వరుసగా విజయాలు సాధిస్తూ వచ్చిన టీమ్ ఇండియా ఇక ఫైనల్లో సౌత్ ఆఫ్రికా జట్టును ఓడించి టైటిల్ విజేతగా అవతరించింది. టి20 ఫార్మాట్లో దాదాపు 17 ఏళ్ల తర్వాత ఇక ఐసీసీ టైటిల్ ని ముద్దాడింది అని చెప్పాలి. అయితే ఇక టీమిండియా వరల్డ్ కప్ టైటిల్ గెలవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కాగా టీమిండియా ఇలా వరల్డ్ కప్ గెలవడానికి అటు సూర్యకుమార్ యాదవ్ చివరలో పట్టిన ఒక క్యాచ్ ఎంతో కీలకము అని చెప్పాలి. ఈ క్యాచ్ పై అందరూ ప్రశంసలు కురిపించారు. కానీ కొంతమంది మాత్రం విమర్శలు చేశారు. సూర్య కుమార్ యాదవ్ కాలు బౌండరీ లైన్ రోప్ కి తాకినప్పటికీ ఇక ఎంపైర్లు అది పట్టించుకోలేదు అంటూ విమర్శలు చేశారు.


 అయితే ఎట్టకేలకు ఈ విషయంపై అటు టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో తాను అందుకున్నది క్లీన్ క్యాచ్ అంటూ సూర్య కుమార్ యాదవ్ స్పష్టం చేశాడు. సాధారణంగా రోహిత్ భాయ్ లాంగాన్ లో ఫీలింగ్ చేయరు. కానీ అప్పుడు చేశారు. అయితే మిల్లర్ క్యాచ్ రోహిత్ తీసుకుంటారేమో అనుకున్న. ఆ సమయంలో ఒక్కక్షణం ఆయన వైపు చూశాను. ఆయన కూడా నా వైపు చూశారు. నేను పరిగెత్తుకుంటూ వెళ్లి క్యాచ్ అందుకున్నాను. అయితే రోహిత్ నాకు దగ్గరలో ఉండి ఉంటే బంతి అతనికి వేసేవాడిని. కానీ చూస్తే ఆయన దగ్గరలో లేరు. దీంతో మళ్ళీ గాల్లోకి ఎగరేసిన బంతిని తానే పట్టుకున్నాను అంటూ సూర్య కుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: