ప్రపంచ క్రికెట్లో అగ్రశ్రేణి టీమ్స్ లో ఒకటిగా కొనసాగుతున్న భారత జట్టు వరల్డ్ ఛాంపియన్ గా కూడా కొనసాగుతుంది అని చెప్పాలి. అయితే మొన్నటి వరకు ఏకంగా మూడు వరల్డ్ కప్ లు సాధించిన జట్టుగా టీమ్ ఇండియా రికార్డ్ సృష్టించింది. అప్పుడేప్పుడో 1983లో కపిల్ దేవ్ కెప్టెన్సీలో మొదటిసారి టీమిండియా వరల్డ్ కప్ ను ముద్దాడ కలిగింది. ఆ తర్వాత చాలా గ్యాప్ లో ఇక ధోని కెప్టెన్సీలో రెండుసార్లు టీమ్ ఇండియా వరల్డ్ కప్ గెలవగలిగింది అని చెప్పాలి.


 అయితే ఇక ఇటీవలే ముగిసిన 2024 t20 వరల్డ్ కప్ లో కూడా భారత జట్టు టైటిల్ విజేతగా నిలిచింది అన్న విషయం తెలిసిందే. మొదటి మ్యాచ్ నుంచి కూడా జైత్రయాత్ర ప్రారంభించిన టీమిండియా ఒక్క ఓటమి కూడా లేకుండా ఫైనల్ వరకు దూసుకెళ్లింది. ఇక ఫైనల్లో సౌత్ ఆఫ్రికాని ఓడించి ఇక విశ్వ విజేతగా అవతరించింది టీం ఇండియా. ఇలా రోహిత్ శర్మ కెప్టెన్సీలో నాలుగవ వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడ కలిగింది అని చెప్పాలి. అయితే భారత జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మ వరల్డ్ కప్ గెలిచిన సారధిగా రికార్డు సృష్టించడమే కాదు.. ఇక 257 పరుగులతో టాప్ స్కోరర్ గా కూడా నిలిచాడు.


 ఈ క్రమంలోనే వరల్డ్ కప్ టోర్నీలో భారత జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు ఎవరు అన్న విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే 1983 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో కపిల్ దేవ్ 303 పరుగులు చేయగా.. ఇక ఇదే అత్యధిక స్కోరు. ఇక 2007 t20 వరల్డ్ కప్ లో గౌతమ్ గంభీర్ 227 పరుగులు చేశాడు. 2011 వన్డే వరల్డ్ కప్ లో సచిన్ టెండూల్కర్ 482 పరుగులు, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో శిఖర్ ధావన్ 363 పరుగులు, 2024 t20 వరల్డ్ కప్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 257 పరుగులు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: