భారత్లో క్రికెట్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో రకాల ఆటలు ఉన్నప్పటికీ క్రికెట్ ను మాత్రమే అమితాంగా అభిమానిస్తూ ఆదరిస్తూ ఉంటారు ప్రేక్షకులు. క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చాలు టీవీలకు అతుక్కుపోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే క్రికెటర్లను ఏకంగా దేవుళ్ళు లాగా ఆరాధించే ప్రేక్షకులు కూడా మన దేశంలో కోట్లాదిమంది కనిపిస్తూ ఉంటారు. అందుకే నేటి రోజుల్లో ఎంతో మంది యువత క్రికెట్ ని ఫ్యాషన్ గా మార్చుకొని అటువైపుగా అడుగులు వేస్తున్నారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఒక్కసారి ఎవరైనా ప్లేయర్ అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టారు అంటే చాలు ఇక వారి కెరియర్ పూర్తిగా మారిపోతూ ఉంటుంది. వారి జీవన విధానం కూడా లగ్జరీగా మారుతూ ఉంటుంది. అంతలా క్రికెట్లోకి రాగానే అందరూ డబ్బులు సంపాదిస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇలా ఇప్పటి ప్లేయర్ల పరిస్థితి ఇలా ఉంటే ఒకప్పుడు టీమిండియా తరఫున ఆడి ఎన్నో రోజులపాటు సేవలందించిన కొంతమంది మాజీ క్రికెటర్ల పరిస్థితి మాత్రం దీనస్థితిలో ఉంటుంది అన్న విషయం అప్పుడప్పుడు తెర మీదకు వచ్చిన వీడియోలను చూస్తే అర్థమవుతూ ఉంటుంది.




 ఇక ఇప్పుడు ఏకంగా టీమ్ ఇండియాకు ఒకప్పుడు ప్రధాన కోచ్గా పని చేసిన మాజీ ఆటగాడు దీనస్థితిలో ఉన్నాడు అన్నది తెలుస్తోంది. టీమిండియా మాజీ హెడ్ కోచ్ అన్షుమాన్ గైక్వాడ్ బ్లడ్ క్యాన్సర్ తో పోరాడుతున్నాడు. లండన్ లోని కింగ్స్ కాలేజ్ ఆస్పత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఆయన చికిత్స కోసం తనకు ఆర్థిక సాయం కావాలని కోరినట్లు మాజీ చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ బీసీసీఐకి తెలిపారు. వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకు 125 కోట్ల నజరానా ప్రకటించినట్లుగానే.. ఇక ఇబ్బందుల్లో ఉన్న ఆయనను ఆదుకునేందుకు ఇక బీసీసీఐ ఆర్థిక సహాయం ప్రకటించాలి అంటూ మాజీ చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: