భారత క్రికెట్లో కొత్త ప్రతిభకు కొదవ లేకుండా పోయింది అన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు యువ ఆటగాళ్లు తమ సత్తా ఏంటో నిరూపించుకుంటూ ఇక భారత్ జట్టుకు తామే ఫ్యూచర్ స్టార్స్ అన్న విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చేస్తున్నారు. కొంతమంది దేశవాళీ టోర్నీలలో అదరగొడుతూ ఉంటే.. ఇంకొంతమంది ఏకంగా ఫ్రాంచైజిల దృష్టిని ఆకర్షించి ఐపీఎల్లో ఛాన్సులు దక్కించుకుంటున్నారు. ఇలా ఏ అవకాశం వచ్చినా కూడా వదలకుండా తమలోని ప్రతిభను బయటపెడుతూ ఇక తమను నిరూపించుకుంటున్నారు అని చెప్పాలి. దీంతో ఇక భారత జట్టులో సీనియర్ ప్లేయర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.


 అప్పటికి టీమిండియా తరఫున అరంగేట్రం చేసి తమ ప్రతిభ ఏంటో నిరూపించుకున్నప్పటికీ.. ఇక ఇలా యువ ఆటగాళ్ల పోటీని తట్టుకునేందుకు ఎప్పటికప్పుడు తమను తామును నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే కొంతమంది మాత్రం ఇలా ఫామ్ నిరూపించుకోలేక వెనుకబడిపోతూ ఉన్నారు. కొంతమంది యంగ్ ప్లేయర్స్ సైతం ఇక టీమ్ ఇండియాలో ఛాన్స్ కోల్పోతున్నారు అన్న విషయం తెలిసిందే. అలాంటి వారిలో ఇషాన్ కిషన్ కూడా ఒకరు. ఒకప్పుడు అతను టీమిండియాలో కీలక ప్లేయర్గా ఎదుగుతాడు అని అందరూ అనుకున్నారు. అయితే బీసీసీఐ సెలెక్టర్లు కూడా అతనికి వరుసగా ఎన్నో ఛాన్సులు ఇచ్చారు.


 కానీ అతను మాత్రం నిరూపించుకోలేకపోయాడు. అంతేకాదు బిసిసిఐ ఆదేశాలను కూడా కొన్నిసార్లు అతను పాటించలేదు. దీంతో ఇక సెలక్టర్లు అతన్ని పూర్తిగా పక్కన పెట్టేసారు. ఈ క్రమంలోనే టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ ముగిసినట్లే కనిపిస్తుంది. ఎందుకంటే భారత జట్టు తరుపున ఏ సిరీస్ కు కూడా బీసీసీఐ ఇషాన్ కిషన్ ను పరిగణలోకి తీసుకోవడం లేదు. చివరకు జింబాబ్వే టి20 కూడా అతని సెలెక్ట్ చేయలేదు. సౌత్ ఆఫ్రికా పర్యటనకు ముందు అటు ఇషాన్ కిషన్ టీమిండియాలో మూడు ఫార్మాట్లలో కీలక ఆటగాడిగా కొనసాగాడు. కానీ ఆ తర్వాత బీసీసీఐ తో విభేదాలు తలెత్తడంతో చివరికి సెంట్రల్ కాంటాక్ట్ ని కూడా కోల్పోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: