ఎన్నో ఏళ్లుగా ఐసీసీ ఈవెంట్లలో టైటిల్ విజేతగా నిలవాలని సర్వ ప్రయత్నాలు చేస్తున్న టీమిండియా.. ఎట్టకేలకు తమ కలను నెరవేర్చుకుంది. అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఇక ఇటీవల జరిగిన టి20 వరల్డ్ కప్ లో టైటిల్ విజేతగా నిలిచింది అన్న విషయం తెలిసిందే. దాదాపు 13 ఏళ్ల తర్వాత ఇలా వరల్డ్ కప్ టైటిల్ ముద్దాడింది. ఇక టి20 ఫార్మాట్లో 2007 తర్వాత ఇక 17 ఏళ్ల గ్యాప్ లో ఇలా వరల్డ్ కప్ టైటిల్ ని అందుకోవడం గమనార్హం.


 ఈ క్రమంలోనే ఇలా ఒక్క ఓటమి కూడా లేకుండా ఫైనల్ వరకు దూసుకు వెళ్లి ఇక ఫైనల్లో విజయం సాధించి వరల్డ్ కప్ టైటిల్ గెలిచిన టీమ్ ఇండియాపై ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం మొత్తం ప్రశంసల వర్షం కురిపిస్తుంది అని చెప్పాలి. టీమిండియా ఆటగాళ్లకు తిరుగులేదని.. అద్భుతమైన ప్రదర్శనతో అదరగొట్టేస్తూ ఉన్నారు అంటూ అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే భారత దాయాది దేశమైన పాకిస్తాన్ జట్టు మాత్రం కనీసం సూపర్ 8 లో కూడా అడుగుపెట్టలేక లీగ్ దశతోనే టోర్ని నుంచి నిష్క్రమించింది అన్న విషయం తెలిసిందే . ఈ క్రమంలోనే ఆ జట్టు పై విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి.


 అయితే టి20 వరల్డ్ కప్ టోర్నీలో భారత జట్టు వరల్డ్ కప్ టైటిల్ గెలవడంపై అటు పాకిస్తాన్ జట్టులో కీలక పేరుగా కొనసాగుతున్న ఫేసర్ షాహిన్ అఫ్రిది స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టి20 వరల్డ్ కప్ గెలిచి మరోసారి టీమిండియా తన బ్రాండ్ ను నిలబెట్టుకుంది అంటూ షాహిన్ ఆఫ్రిది ప్రశంసించాడు. ఫైనల్లో భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసింది అంటూ కొనియాడాడు. ఫైనల్లో రెండు జట్లు హోరా హోరిగా పోరాడాయ్. ఒత్తిడిని తట్టుకొని ఏ జట్టు రాణిస్తుందో ఆ జట్టే ఛాంపియన్గా నిలుస్తుంది. ఫైనల్ లో ఒత్తిడిని జయించి టీం ఇండియా ఛాంపియన్గా నిలిచింది. వరల్డ్ కప్ టైటిల్ గెలుచుకునేందుకు టీమిండియా అర్హత కలిగిన జట్టు అంటూ పాకిస్తాన్ ప్లేయర్ ప్రశంసలు కురిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: