టీమిండియాలో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న హార్దిక్ పాండ్యా ఎంత అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో బ్యాటింగ్లో అదరగొట్టడమే కాదు ఇక బౌలింగ్లో అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటాడు. అందుకే హార్దిక్ పాండ్యాను చూసిన తర్వాత మా జట్టులో కూడా ఇలాంటి ఒక ఆల్రౌండర్ ఉంటే బాగుండు అని ఇతర టీమ్స్ అన్నీ కూడా కోరుకుంటూ ఉంటాయి.


 అయితే ఇటీవల వెస్టిండీస్, యుఎస్ వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ టోర్నీలో కూడా హార్దిక్ పాండ్య అదరగొట్టాడు. అంతకుముందు జరిగిన ఐపీఎల్లో చెత్త ప్రదర్శన చేసి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు హార్దిక్ పాండ్యా.  కానీ ఆ తర్వాత ప్రారంభమైన టి20 వరల్డ్ కప్ టోర్నీలో మాత్రం అదరగొట్టేసాడు. ఏకంగా టీమిండియా విజయాలలో కీలకపాత్ర వహించాడు. బౌలింగ్ లోనే కాదు బ్యాటింగ్లో కూడా ఇరగదీసాడు. అయితే తనపై విమర్శలు చేసిన వారందరికీ కూడా కేవలం నోటితో కాదు తన ప్రదర్శనతోనే సమాధానం చెప్పాడు అని చెప్పాలి  ఒక రకంగా టీమిండియా వరల్డ్ కప్ గెలవడానికి అతను ఒక ప్రధాన కారణం అయ్యాడు.


 ఈ క్రమంలోనే ఇక ఇప్పుడు మరో అరుదైన రికార్డును సాధించాడు హార్దిక్ పాండ్యా.  ఐసిసి టి20 ర్యాంకింగ్స్ లో టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య అగ్రస్థానానికి దూసుకు వెళ్ళాడు. 222 పాయింట్లతో టాప్ ప్లేస్ లోకి చేరుకున్నాడు. ఆ తర్వాత వనిందు హసరంగా స్టోయినిస్ సికిందర్ రజా షాకీబ్ ఉన్నారు. ఇక బ్యాట్స్మెన్ల విభాగంలో ఆస్ట్రేలియా ఓపెనర్ హెడ్ టాప్ లో ఉన్నారు. సూర్య కుమార్ యాదవ్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. బౌలర్ల విభాగంలో అన్రిచ్ మొదటి స్థానంలో ఉండగా అక్షర్ పటేల్ 8వ స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా దాదాపు 17 ఏళ్ల విరామం తర్వాత ఇటీవల టీమిండియా వరల్డ్ కప్ టైటిల్ గెలుచుకుంది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: