ఇండియాలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో రకాల ఆటలు ఉన్నప్పటికీ క్రికెట్ ను మాత్రం అమితంగా ఆదరిస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఇక క్రికెటర్లను ఆరాధ్య దైవంగా చూస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే క్రికెట్ మ్యాచ్ ఎక్కడ జరుగుతున్న కూడా అక్కడికి తరలి వెళ్లి స్టేడియంలో కూర్చుని ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షించడానికి తెగ ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. అయితే క్రికెట్కు ఈ రేంజ్ లో క్రేజ్ ఉంది కాబట్టే ఇక ఇటీవల టీం ఇండియా వరల్డ్ కప్ గెలవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయ్. దాదాపు 13 ఏళ్ల నిరీక్షణ తర్వాత టీమ్ ఇండియా వరల్డ్ కప్ ను ముద్దాడింది అన్న విషయం తెలిసిందే.


 అది కూడా ఒక్క ఓటమి లేకుండా ఇలా వరల్డ్ కప్ టైటిల్ను గెలుచుకోవడం మామూలు విషయం కాదు. దీంతో ఎక్కడ చూసినా కూడా టైటిల్ గెలిచిన టీమ్ ఇండియా పై అందరూ ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు అని చెప్పాలి. అయితే ఇంకా ఇప్పుడు టీమిండియా ఇటీవలే వరల్డ్ కప్ ట్రోఫీతో స్వదేశానికి చేరుకొంది. ఈ క్రమంలోనే ఇక రాష్ట్రాల ప్రభుత్వాలు ఇక దేశం తరఫున ఆడి వరల్డ్ కప్ సాధించిపెట్టిన తమ రాష్ట్ర క్రికెటర్లకు సన్మానం చేస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. అయితే వరల్డ్ కప్ జట్టులో భాగమైన మహమ్మద్ సిరాజ్ కూడా ఇక ఇప్పుడు సొంత ప్రాంతమైన హైదరాబాద్ రాబోతున్నాడు. ఈ క్రమంలోనే ఈరోజు హైదరాబాద్లో మహ్మద్ సిరాజ్ రోడ్ షో ఉండబోతుంది అన్నది తెలుస్తుంది.


 టి20 ప్రపంచ కప్ విజేత మహమ్మద్ సిరాజ్ నేడు హైదరాబాద్లో రోడ్ షో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన అభిమానులు పర్యవేక్షిస్తున్నారు అన్నది తెలుస్తుంది. సాయంత్రం 6:30 గంటలకు మెహదీపట్నంలోని సరోజినీ ఐ హాస్పిటల్ నుంచి ఈద్గా మైదానం వరకు ఈ రోడ్ షో కొనసాగుతుందట. అయితే రోడ్ షోకు అభిమానులు తరలిరావాలని సిరాజ్ తన సోషల్ మీడియాలో కోరారు. కాగా నిన్న టీమిండియా ఆటగాళ్లు అందరూ కూడా ముంబైలో రోడ్ షో నిర్వహించగా అభిమానులు లక్షల్లో తరలివచ్చారు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: